Iran Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని అంటూ.. ఇజ్రాయెల్ యుద్ధానికి సై అంటోంది. దాడి చేస్తే తిరిగి అటాక్ చేస్తామని ఇరాన్ చెబుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇతర దేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన ఎగుమతులు, దిగుమతులపై దీని ప్రభావం భారీగా ఉంటుంది. ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది. పైగా చాలా తక్కువ ధరలో మనకు చమురును దిగుమతి చేసుకుంటాం.
అయితే, ఆ దిగుమతులు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సప్లై తగ్గి.. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా 88 శాతం చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి వస్తోంది. ఇందులో ఇరాన్ ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశం. ప్రతి రోజు 3.2 నుంచి 3.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వంటి ముఖ్యమైన షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడవచ్చు. దీంతో చమురు సరఫరా తగ్గి.. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ కు 80 డాలర్ల నుంచి 100 డాలర్లకు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
భారత్ కు ఈ రెండు దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 2022-23లో ఇజ్రాయెల్ లో 10.7 బిలియన్ డాలర్లు, ఇరాన్ తో 2.33 బిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది. ప్రస్తుతం ఈ యుద్ధంతో రెడ్ సీ, సూయెజ్ కెనాల్ వంటి కీలక షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో షిప్పింగ్ ఖర్చులు 15 నుంచి 20 శాతం పెరిగాయి. దీంతో ఇంజినీరింగ్ ఉత్పత్తులు, టెక్స్ టైల్స్, గార్మెంట్స్ లాంటి వాటి ఎగుమతుల్లో వచ్చే లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఇరాన్ కు భారత్ టీ, బియ్యం, మాంసం వంటి వస్తువులను ఎగుమతి చేస్తోంది. యుద్దం కారణంతో ఈ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది.
ALSO READ: AP Hidden Places: ఏపీలో తెలియని అరుదైన ప్రదేశాలు ఇవే.. ఇప్పుడే ట్రిప్ ప్లాన్ చేయండి!
అప్పుడు ఈ వస్తువుల సప్లై మన దేశంలో పెరుగుతోంది. దీని కారణంగా టీ, మాంసం, బియ్యం ధరలు మన దేశంలో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సప్లై పెరిగితే.. అటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి. 2024లో 4.91 మిలియన్ కేజీల టీ ఎగుమతి జరిగింది. ఈ ఎక్స్ పోర్ట్ తగ్గితే.. భారత్ లో టీ పొడి ధరలు తగ్గవచ్చు. అలాగే బియ్యం, పంచదార, ఫార్మస్యూటికల్స్, మందులు, రసాయనాలు, ఆటోమొబైల్స్ భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులను మన దేశం ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటి ఎగుమతులకు సమస్యలు వస్తే.. మన దేశంలో రేట్లు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ALSO READ: Gold Rate Today: మరో లక్ష పెరగనున్న బంగారం ధర.. ఎప్పటినుండంటే
రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా.. ఇరుదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ నుంచి ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్, ఫెర్టిలైజర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, అల్యూమినియం, కెమికల్స్, ముత్యాలు దిగుమతి అవుతున్నాయి. ఇరాన్ నుంచి ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, గింజలు, ఆయిల్స్, ఉప్పు, సల్ఫర్, లైమ్, సిమెంట్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఐరన్, స్టీల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.