BigTV English

Naga Shaurya: ఇద్దరు డైరెక్టర్లు.. బడ్జెట్ 40 కోట్లు.. మార్కెట్ దాటుతుంది గురూ.. ?

Naga Shaurya: ఇద్దరు డైరెక్టర్లు..  బడ్జెట్ 40 కోట్లు.. మార్కెట్ దాటుతుంది గురూ.. ?

Naga Shaurya: టాలీవుడ్ కుర్ర హీరోల్లో నాగ శౌర్య ఒకడు.  ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే  మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాగానే నిలదొక్కుకున్నాడు. అయితే వరుస సినిమాలు చేస్తున్నా..  ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.  అయినా పట్టు వదలని విక్రమార్కుడులా టాలీవుడ్ పై యుద్దాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు.


గతేడాది శౌర్య సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. 2023 లో రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక రెండేళ్ల గ్యాప్ తరువాత శౌర్య  మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు శౌర్య పుట్టినరోజు కావడంతో ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. రమేష్ దేసిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇక ఈ సినిమాను వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రావు చింతలపూడి, విజయ కుమార్ చింతలపూడి, అశోక్ చింతలపూడి నిర్మిస్తున్నారు.  ఇక ఈ పోస్టర్ లో శౌర్య చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. ఒక వ్యాన్ వెనుక భాగంలో ఒక కాలు కింద .. ఇంకో కాలు వ్యాన్ మీద పెట్టి సీరియస్  లుక్ లో కనిపించాడు. ఇక చేతులకు రక్తం.. ఆ రక్తంతో  నుదుటిన  బొట్టు పెట్టినట్లు  చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.


Allu Arjun and Shah Rukh Khan : పవర్ ప్యాక్డ్ కొలాబరేషన్… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా గురించిన ఒక వార్త  నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా మొదట వర్మ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించాడట. సగం సినిమా వరకు షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. అయితే  చేసినంతవరకు వచ్చిన అవుట్ పుట్ మేకర్స్ కు నచ్చలేదట. దీంతో చేసేదేమి లేక తీసిన సినిమాను మొత్తం చెత్తబుట్టలో పడేసి.. డైరెక్టర్ ను మార్చేసి.. మళ్లీ మొదటి నుంచి షూటింగ్ చేయడం జరిగిందంట.

ఈ సినిమా కోసం ఇప్పటివరకు చేసిన షూటింగ్ కోసం మేకర్స్  రూ. 10 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. టోటల్ గా ఈ సినిమా రూ. 30 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే.. బ్యాడ్  బాయ్ కార్తీక్ సినిమా మొత్తం బడ్జెట్  రూ. 40 కోట్లు.  ఇది సాదాసీదా విషయం కాదు. అంత బడ్జెట్ అంటే మాటలు కూడా కాదు.

నాగ శౌర్య లాంటి హీరోకు అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనేది కొందరి మాట. ప్రస్తుతం ఆయనకు అంత మార్కెట్ కూడా లేదు. ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి తీసినా.. సినిమా కనుక మిక్స్డ్ టాక్ ను అందుకుంటే.. నిర్మాతలు మునిగిపోయినట్లే. ఇక ఈ విషయం తెలిసిన కొంతమంది.. శౌర్య మార్కెట్ తెలిసి కూడా నిర్మాతలు అంత రిస్క్ ఎలా తీసుకున్నారు అని మాట్లాడుకుంటున్నారు. లేదు కథ బావుంది కనుక అంత పెట్టారు అంటే.. ఈ సినిమా రిలీజ్ కు ఎలాంటి పోటీ లేకుండా ఉండి, కథ ప్రేక్షకులకు నచ్చితే ఒక మోస్తరుగా నిర్మాతలు బయటపడతారు అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే సినిమా  రిలీజ్ అయ్యేవరకు ఓపిక పట్టాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×