Naga Vamsi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో అఖిల్ ఒకరు. సిసింద్రీ సినిమాతో చాలా చిన్న వయసులోనే చాలామందిని ఆకట్టుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీకి ఆ సినిమా చాలా ప్రత్యేకమైనది. విక్రమ్ కె కుమార్ ఆ సినిమాని డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాలో అఖిల్ క్లైమాక్స్ లో వచ్చి అందరిని సప్రైజ్ చేశాడు. అఖిల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. అప్పుడు నుంచి అఖిల్ హీరోగా ఎప్పుడు సినిమా చేస్తాడా అని చాలామంది ఎదురుచూస్తూ వచ్చారు. వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
అఖిల్ సినిమా కంటే ముందే అడ్వాన్స్ ఇచ్చారు
మామూలుగా కొంతమంది ప్రొడ్యూసర్స్ కి ముందు చూపు ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా చేయడానికి అంటే ముందు నాగవంశీ అఖిల్ కు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్ అఖిల్ దగ్గర ఎప్పటినుంచో అలానే ఉండిపోయింది. అయితే వీళ్ళ బ్యానర్ లో సినిమా చేయడం మాత్రం కుదరలేదు. మొత్తానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాగ వంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కథను నాగ వంశీ మరియు అక్కినేని అఖిల్ వేరువేరు సోర్సెస్ ద్వారా ఒకేసారి విన్నారు. అయితే ఈ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు అని అఖిల్ చెప్పినప్పుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా కలిసి చేద్దామని డిసైడ్ అయ్యి ఈ సినిమాను మొదలుపెట్టారు.
సినిమా పైన మంచి అంచనాలు
అక్కినేని అఖిల్ విషయానికి వస్తే వరుస సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్న తరుణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాతోనే మొదటి హిట్ అందుకున్నాడు అఖిల్. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాను చేశాడు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమాతో సక్సెస్ కొట్టాలి అని ఆలోచనలో ఉన్నారు.
Also Read : Nani Paradise : నాచురల్ స్టార్ వెనక్కి తగ్గాడు, చరణ్ తో పోటీ ఎందుకు అనుకున్నాడా.?