BigTV English

AP School Bus: మీ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తున్నారా? ఏపీ పేరెంట్స్ జర భద్రం!

AP School Bus: మీ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తున్నారా? ఏపీ పేరెంట్స్ జర భద్రం!

AP School Bus: ఏపీలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరిస్థితి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే స్థితికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులు నిత్యం ప్రయాణించే 39,213 స్కూల్ బస్సుల్లో కేవలం 25,454 బస్సులకే చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉందని అధికారుల వద్ద ఉన్న సమాచారం. మిగిలినవి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై తిరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టబోతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే మీ స్కూల్ బస్.. నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది తల్లిదండ్రులు ఆలోచించే సమయం ఆసన్నమైంది.


భద్రతకే ప్రాధాన్యత..
విద్యార్థుల రవాణా కోసం స్కూల్ బస్సులు తప్పనిసరి. కానీ అవి సరైన ఫిట్‌నెస్‌లో లేకపోతే ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నట్లే. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది బస్సు సాంకేతికంగా పరిగణించదగిన స్థితిలో ఉందని రవాణా శాఖ ఇచ్చే ధృవపత్రం. ఇది లేకుండా రోడ్డుపైకి వచ్చే బస్సు నిబంధనలకు విరుద్ధం. అయినా సరే ఏపీలో ఈ పరిస్థితిని నివారించేందుకు, ఏపీ ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దృష్టి సారించింది.

అసలు లెక్కలు ఇవే..
రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 39,213 స్కూల్ బస్సుల్లో కేవలం 25,454 బస్సులకే చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంది. అంటే దాదాపు 14,000 పైగా బస్సులు నిబంధనలకంటే బయటగా నడుస్తున్నాయని అర్థం. వీటిలో చాలా బస్సులు ఇప్పటికే 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు కావడమే కాకుండా, కొన్నింటిని వాణిజ్య ప్రయోజనాల కోసం మారుస్తూ విద్యార్థుల రవాణా కోసం వినియోగిస్తున్నట్లు అధికారుల అనుమానం.


గుంటూరు జిల్లా అత్యధికంగా 1955 ఫిట్‌నెస్ ఉన్న స్కూల్ బస్సులతో ముందంజలో ఉంది. తదుపరి పశ్చిమ గోదావరి 1644, ఎన్టీఆర్ జిల్లా 1641, తూర్పు గోదావరి 1565, కాకినాడ 1505 జిల్లాలు నిలిచాయి. అంటే ఈ జిల్లాల్లో పాఠశాలలు ఎక్కువగా నిబంధనలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర జిల్లాల్లో పరిస్థితి శోచనీయంగా ఉంది.

ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్న రవాణా శాఖ, జూన్ 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులపై దృష్టి పెట్టింది. జిల్లా స్థాయిలో అధికారులు తనిఖీలు చేపట్టి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేయనున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 నుండి 200 కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని డిప్యూటీ రవాణా కమిషనర్ ఎం. పురేంద్ర తెలిపారు.

Also Read: NTR vs Allu Arjun : బావ vs బావ.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన వార్

విద్యార్థుల భద్రతే ముఖ్యమని, ఎలాంటి పరిహారం కోరకుండా స్కూల్ యాజమాన్యాలు తక్షణమే తమ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని ఆయన సూచించారు. ఇలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను రవాణా చేస్తే అది నేరమే కాదు, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే. అందుకే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలి.

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ఒక్కటే.. విద్యార్థుల భద్రత. వాటిని దృష్టిలో పెట్టుకుని నియమాలు రూపొందించినప్పుడు వాటిని తప్పనిసరిగా పాటించడం ప్రతి పాఠశాల బాధ్యత. పాఠశాల యాజమాన్యాలు సమయానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకుని, బస్సులు సాంకేతికంగా సురక్షితంగా ఉన్నాయన్న నమ్మకాన్ని తల్లిదండ్రులకు కల్పించాలి.

ఇప్పుడు ప్రశ్న తల్లిదండ్రులదే.. మీరు పుట్టగొడుగుల్లా పెరిగిన ఫీజులు చెల్లిస్తున్నారు కానీ, మీ పిల్లలు రోడ్డుపై నడుస్తున్న బస్సు సురక్షితమా అనే విషయాన్ని ఎన్నిసార్లు తెలుసుకుంటున్నారు? స్కూల్ యాజమాన్యాన్ని అడుగుతున్నారా? ఫిట్‌నెస్ సర్టిఫికేట్ చూపించమని డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ చర్య మీరు తీసుకుంటే, మీ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×