Nani Paradise : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. దసరా సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి షో పడగానే విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా నానిని చూపించాడు అని ప్రశంసలు అందుకున్నాడు. అలానే సుకుమార్ శిష్యుడు కావడంతో ఆ రకంగా కూడా చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అంచనా వేస్తున్నారు.
పారడైజ్ సినిమా వాయిదా
ఈ సినిమాకి సంబంధించిన వీడియో విడుదల చేసినప్పుడే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మార్చ్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు సుకుమార్ శిష్యులు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం పారడైజ్ సినిమా కొన్ని కారణాల వలన మార్చి నుంచి మే నెలకి వాయిదా పడిపోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ అనేది మే లో స్టార్ట్ కావలసి ఉంది. కానీ సెట్ వర్క్ డిలే అవ్వడంతో ఇది కాస్త ఆగస్ట్ కి షిఫ్ట్ చేశారు. షూటింగ్ వాయిదా పడింది కాబట్టి రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందని విశ్వసినీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నాని ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించారు.
పెద్ది పై కూడా భారీ అంచనాలు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా పెద్ది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలో కూడా రామ్ చరణ్ మాట్లాడే యాస చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ తో పాటు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు కూడా పలు సందర్భాలలో ఈ సినిమా గురించి మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Also Read: 45 Years for Punnami Nagu : మెగాస్టార్ కెరియర్ మలుపు తిప్పిన సినిమా