BigTV English

Nagavamsi: చరణ్ తో త్రివిక్రమ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

Nagavamsi: చరణ్ తో త్రివిక్రమ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

Nagavamsi: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి డైరెక్టర్ గా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు త్రివిక్రమ్. ఆయన సినిమాల్లో డైలాగ్స్ తూటాల్లా పేలుతూ ఉంటాయి. ఆయన మాటలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. అందుకే ఆయనను గురూజీ అని పిలుస్తూ ఉంటారు. అయితే అప్పటి గురూజీ ఇప్పుడు లేడు అనే మాటలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా త్రివిక్రమ్ స్టామినాను చూపే కథనే రాయలేదు. తాను డైరెక్టర్ గా కాకుండా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు సహాయం చేస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత గుంటూరు కారం అంటూ మహేష్ బాబుతో ఒక సినిమా చేశాడు. అయితే అది కేవలం ఫ్యాన్స్ కోసం చేసిన సినిమానే తప్ప అందులో గురూజీ మార్క్ లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ తన మార్క్ చూపించడానికి సిద్దమయ్యాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి ప్రేక్షకులను అలరించనున్నాడు.


 

ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే అంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చలు చాలా గట్టిగా జరుగుతున్నాయి.కొందరు త్రివిక్రమ్ – రామ్ అని, ఇంకొందరు త్రివిక్రమ్- రామ్ చరణ్ అని.. మరికొందరు బన్నీ సినిమాను చరణ్ కు వినిపించాడని.. ఇలా పలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుకితం త్రివిక్రమ్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి వెంకటేష్ తో.. ఇంకొకటి ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరు హీరోలతో కాకుండా వేరేహీరోలతో గురూజీ సినిమాలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్  వేరే హీరోలతో చేస్తున్నాడు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అని, ఆయన వేరే ఏ సినిమా ఫిక్స్ అయినా తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.


 

గుంటూరు కారం తరువాత గురూజీ..  అల్లు అర్జున్ తో ఒక సినిమాను ప్రకటించాడు. ఇప్పటికే  వీరి కాంబోలో మూడు హిట్ సినిమాలు రావడంతో.. ఈ నాలుగో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. పుష్ప 2 తరువాత బన్నీ.. త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కిస్తాడు అనుకుంటే.. అట్లీతో చేతులు కలిపి పాన్ ఇండియా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ సినిమా ఎప్పుడు అవుతుందో తెలియదు. అప్పటివరకు గురూజీ.. వెంకీమామతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వినిపించాయి. మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. బన్నీ ప్రాజెక్ట్ చివరకు ఎన్టీఆర్ వద్దకు చేరింది. కుమార స్వామి కథ నేపథ్యంలో ఈ సినిమాను గురూజీ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

 

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వార్ 2 ను ఫినిష్ చేసి డబ్బింగ్ కూడా మొదలుపెట్టిన తారక్.. తాజాగా ప్రశాంత్ నీల్ డ్రాగన్  షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీని తరువాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. డ్రాగన్ ఫినిష్ అయిన వెంటనే ఎన్టీఆర్.. నెల్సన్ ది మొదలు పెడతాడా.. ? త్రివిక్రమ్ ది మొదలు పెడతాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×