BigTV English
Advertisement

Nagababu: మీ కష్టానికి కాపు కాస్తాడు. మీ భవిషత్తు భధ్రతకి కాపలా కాస్తాడు

Nagababu: మీ కష్టానికి కాపు కాస్తాడు. మీ భవిషత్తు భధ్రతకి కాపలా కాస్తాడు

Nagababu: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ప్రస్తుతం ఇదే పాటను పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. పదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగురవేసింది లేదు. కానీ, పదేళ్ల తరువాత ఈరోజు ఆయన విజయకేతనం కాదు.. విజయ ప్రభంజనం చూపించాడు. ఇప్పటివరకు ఎవరు రాయలేని రికార్డును రాశాడు.


పోటీచేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపించాడు. పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశాడు. ఇక ఈ ఘనవిజయానికి అభిమానులు పవన్ కు హారతులు పడుతున్నారు. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని సంబరపడుతున్నారు. ఉదయం నుంచి పవన్ వీడియోలతో సోషల్ మీడియా దుమ్ములేపుతోంది.

ఇక పవన్ విజయానికి ప్రశంసలు దక్కుతున్నాయి.శుభాకాంక్షలతో ట్విట్టర్ మారుమ్రోగిపోతుంది. మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. తమ్మడు విజయాన్ని ఆదేశించి ఎమోషనల్ నోట్ ను అభిమానులతో పంచుకున్నాడు.


జనసేన స్థాపించనప్పటి నుంచి పవన్ పక్కన ఎవరు ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం ఉన్నాడు. తమ్ముడును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థిస్తూ.. వెన్నంటి నిలబడ్డాడు. నేడు ఈ ఘనవిజయాన్ని అందుకున్న పవన్ గురించి నాగబాబు.. పిఠాపురం ప్రజలకు చెప్పుకొచ్చాడు.

” పిఠాపురం ప్రజానీకానికి జనసేనాని గెలుపు లో భాగమైన ప్రతి ఓటరుకి,అఖండ మెజార్టీతో కారణమైన ప్రతి జనసైనికుడికి,వీర మహిళలలకి పిన్నలకి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు.ఆయన విజయాన్ని భుజాన వేస్కునే భాద్యత మీరు తీస్కుని ఇంతటి ఘన విజయాన్ని అందించారు. మీ భాద్యత ఆయన భుజాల మీద వేస్కుని మీ కష్టానికి కాపు కాస్తాడు. మీ భవిషత్తు భధ్రత కి కాపలా కాస్తాడు. మేము కూడ పిఠాపురం అభివృద్ధి లో మన నాయకుడితో భాగమవుతాము.. ఇది సేనాని మాటగా నేను మీకు మనసా వాచా కర్మణా చెప్తున్నాను..మీ నాగబాబు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×