BigTV English

Nagarjuna : నాగార్జున‌కు కొత్త త‌ల‌నొప్పి.. గోవా ప్ర‌భుత్వం నోటీసులు

Nagarjuna : నాగార్జున‌కు కొత్త త‌ల‌నొప్పి.. గోవా ప్ర‌భుత్వం నోటీసులు

Nagarjuna : టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున సినిమాల‌తో బిగ్ బాస్ , సినిమాల నిర్మాణంతో బిజీగా ఉంటుంటారు. ఇది కాకుండా కొత్త వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఇక్క‌డ రాజ‌కీయ నాయ‌కుల‌తో మంచి అనుబంధం ఉండ‌టంతో ఆయ‌న త‌న వ్యాపారాల‌ను విస్తరిస్తూ వెళ్లారు. తాజాగా ఆయ‌న గోవాలోనూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ‌టానికి రెడీ అయ్యారు. అందుకు గోవాలోని మాండ్రెమ్ అశ్వేవాడ‌ గ్రామంలో నిర్మాణాలు చేప‌ట్టారు. అయితే ఈ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌కి ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేదు. దీనిపై స‌ద‌రు గ్రామానికి చెందిన స‌ర్పంచు ఆఫీసు నుంచి నాగార్జున‌కి నోటీసులు వ‌చ్చాయి.


పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం 1994 కింద మాండ్రెమ్ అశ్వేవాడ స‌ర్పంచ్ అమిత్ సావంత్ లీగ‌ల్ నోటీసులు పంపారు. నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపి వేయాల‌ని, లేకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స‌ద‌రు నోటీసుల్లో వారు పేర్కొన్నారు. దీంతో నాగార్జున కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంద‌నే చెప్పాలి. అయితే ఈ వ్య‌వ‌హారంపై నాగార్జున సంబంధిత టీమ్ ఎవ‌రూ స్పందించ‌లేదు మ‌రో వైపు నాగార్జున త‌దుప‌రి చిత్రాన్ని బెజ‌వాడ ప్ర‌స‌న్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి త‌ప్పుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్స్ జ‌రిగితే తొలి రెండు సీజ‌న్స్ మిన‌హా మిగ‌తా వాటిని నాగార్జునే హోస్ట్ చేస్తూ వ‌చ్చారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×