BigTV English

Nagarjuna -Akhil : అఖిల్ వాళ్ల అమ్మ‌ని చిన్న‌ప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టాడు

Nagarjuna -Akhil : అఖిల్ వాళ్ల అమ్మ‌ని చిన్న‌ప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టాడు
Nagarjuna -Akhil

Nagarjuna -Akhil : ‘‘‘ఏజెంట్’ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందో అంటే .. మా అక్కినేని అభిమానులు. మీరు చూపిస్తున్న ప్రేమ. ప్రతిభ, కష్టం ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది’’ అన్నారు అక్కినేని నాగార్జున. ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన స‌మావేశంలో..


అగ్ర హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు.. వైల్డ్ వరంగల్. మా అందరికీ మీరంటే పిచ్చి. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు సినిమాలంటే ప్రేమచూపిస్తారు.. ఒక కొత్త జోనర్ తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి గారు అదే కొత్త జోనర్ తో ఒక చక్కటి సినిమా, థ్రిల్లింగ్ సినిమా, స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడలేదు, కథ వినలేదు. కానీ అఖిల్ ఇంట్లో చెబుతుంటే వినేవాడిని. బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. సురేందర్ రెడ్డి గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశారు. అలాగే అనిల్ సుంకర గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. మీరు స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి చాలా మంచి భవిష్యత్ వుండాలి.

సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కథ ఓప్పుకున్నారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్ కి పెద్ద హిట్ అవుతుందని ఆనందపడ్డాను. ఇటివలే మమ్ముట్టి గారి మాతృమూర్తి ఫాతిమా గారు కన్నుమూశారు. ఫాతిమా గారి ఆత్మకి శాంతి చేకూరాలి. మమ్ముట్టి గారు ఎంత అంకితభావం కలిగిన నటుడు అంటే.. ఇంత కష్టకాలంలో కూడా డబ్బింగ్ ఫినిష్ చేసి విడుదలకు రెడీ చేశారు. వారికి కృతజ్ఞతలు. ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి (నవ్వుతూ) వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చుస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొట్టలో ఉన్నపుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర వున్నప్పుడు రెస్ట్ లెస్ గా పరిగెత్తేవాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎనర్జీ వుంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను’’ అన్నారు.


Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×