
virat Kohli ipl : ఈ ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు కోహ్లీ. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 46.50 సగటుతో 279 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు, దీంతో పాటు అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు విరాట్. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచులు పట్టిన మూడో ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు.
మొన్ననే అత్యధిక ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కొహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 600లకు పైగా ఫోర్లు కొట్టాడు. ఈ రికార్డులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది శిఖర్ ధావన్. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
ఇప్పుడు వంద క్యాచులు పట్టిన ఆటగాళ్లలోనూ విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఇచ్చిన క్యాచులను పట్టి ఐపీఎల్ లో వంద క్యాచులు పూర్తి చేసుకున్నాడు కొహ్లీ. అంతేకాదు బెంగుళూరు జట్టు తరపున వంద క్యాచులు పట్టిన ఏకైక ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కంటే ముందు సురేష్ రైనా 109 క్యాచ్‌లు, కీరన్ పొలార్డ్ 103 క్యాచ్‌లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ లెక్కన… అతి త్వరలోనే కొహ్లీ ఫస్ట్ ప్లేస్‌కి రావొచ్చు.