Rana Daggubati: సినిమా అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం అనేది చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడం అనేది ఇంకా ముఖ్యం. అందుకే హీరోయిన్స్ సర్జరీలు చేయించుకొని కొత్త అందాలను కొనితెచ్చుకుంటున్నారు. హీరోలు కూడా సర్జరీలు చేయించుకుంటారు. కానీ, అవి బయటకు రావు. ఇవన్నీ పక్కన పెడితే .. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హీరోల జుట్టు గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ హీరోల జుట్టు ఒరిజినల్ కాదని, కొంతమంది విగ్ వాడతారని,ఇంకొంతమంది హెయిర్ పెట్టించుకున్నారని పుకార్లు వింటూనే ఉన్నాం.
కొద్దిగా జుట్టు ఎక్కువ కనిపిస్తే.. ఇంటర్వ్యూలలో యాంకర్స్ డైరెక్ట్ గా ఆ హీరోను.. మీ జుట్టు ఒరిజినలేనా అని అడిగేస్తున్నారు కూడా. దసరా సినిమా సమయంలో ఒక యాంకర్.. నానిని ఇదే ప్రశ్న అడిగింది. దానికి నాని.. ” నా జుట్టు ఒరిజినలే. దయచేసి ఇంకే హీరోను ఇలాంటి ప్రశ్న అడగకండి.. ఫీల్ అవుతారు” అని చెప్పుకొచ్చాడు. నాని అలా అనడానికి కారణం ఇండస్ట్రీలో చాలామంది తమ హెయిర్ ను కోల్పోయారు. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు.
Unstoppable With NBK: లక్కీ భాస్కర్ టీమ్ తో రచ్చ లేపిన బాలయ్య.. హైలైట్ అంటే ఆ ప్రశ్నే..
టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు కుడా ఇలా హెయిర్ ను పెట్టించుకున్నారని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ నిజమైనా.. దాన్ని బయట ఒప్పుకోలేరు. సరే.. ఇప్పుడు ఈ జుట్టు గోల ఏంటి అని అంటే.. తాజాగా ఒక స్టార్ నటుడు మాత్రం.. తనది ఒరిజినల్ జుట్టు కాదు అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు.. మన భల్లాలదేవ రానా దగ్గుబాటి. టాలీవుడ్ హల్క్ గా ప్రేక్షకుల మనసులను దోచేసిన రానా.. లక్కీ భాస్కర్ టీమ్ ను ఇంటర్వ్యూ చేశాడు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దుల్కర్, మీనాక్షీని రానా ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఇందులో రానా తన భయాల గురించి మాట్లాడాడు.
Prasanth Varma: చిన్న టీజర్ కట్‌కు రూ.2 కోట్లా.? ప్రశాంత్ వర్మను పక్కన పెట్టిన ఆహా.?
నా జీవితంలో నేను ఎక్కువ అభద్రతాభావానికి గురయ్యేది నా జుట్టు గురించే.. అని చెప్పగా వెంటనే దుల్కర్.. మీ జుట్టుకు ఏమైంది.. చాలా బావుంది అని అనగా వెంటనే రానా అది ఫిక్స్డ్ హెడ్ ఆఫ్ హెయిర్ అని చెప్పాడు. ఆ మాట వినగానే దుల్కర్, రానాను ప్రశంసించాడు. నిజాయితీగా ఇలా ఒప్పుకోవడం చాలా గ్రేట్ అని తెలిపాడు.
దుల్కర్ ను చూసినప్పుడు .. అసలు ఆ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావ్.. నాకన్నా పెద్దవాడివి అని అడుగుతాను అని రానా చెప్పుకొచ్చాడు. ఫిక్స్డ్ హెడ్ ఆఫ్ హెయిర్ అంటే.. వెనుక జుట్టు ఉండదు. అక్కడ హెయిర్ ను అతికిస్తారు. రానాకు కూడా వెనుక జుట్టును అతికించారని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజంగా రానా కెమెరా ముందు అలా తన జుట్టు ఒరిజినల్ కాదు అని చెప్పడానికి గట్స్ ఉండాలి. హ్యాట్సాఫ్ భయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.