Balakrishna : సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, ఇండస్ట్రీలోకి ఒకే తరం హీరోలుగా అడుగుపెట్టిన వారిలో దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా నాగార్జున , బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఇది మరొకసారి బయటపడింది. ముఖ్యంగా బాలయ్యకి ఏ ఏడాది ‘పద్మభూషణ్’ అవార్డు వస్తే నాగార్జున స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.వాస్తవానికి వీరిద్దరూ గతంలో సుబ్బరామిరెడ్డి అవార్డు ఫంక్షన్ లో కలిశారు. విభేదాలు లేవని కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ మాత్రం తరచూ వినిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు గతంలో ఒక ఈవెంట్లో బాలకృష్ణ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)ను ఉద్దేశించి అక్కినేని- తొక్కినేని అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలకృష్ణపై విమర్శలు గుప్పించినా.. వెంటనే బాలయ్య స్పందించి తాను అక్కినేని నాగేశ్వరరావు బాబాయ్ అని పిలుస్తానని, అందుకే తాను తన బాబాయిని సరదాగా సంబోధించానని కూడా కామెంట్లు చేశారు.అయినా సరే ఈ విషయంపై నాగార్జున కాస్త గుర్రుగానే ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు మరొకసారి ఈ విషయం కాస్త బయటపడింది. బాలయ్యకి అత్యంత ప్రతిష్టాత్మక భారత ప్రభుత్వ మూడవ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. బాలకృష్ణకి ఇండస్ట్రీ నుంచి అందరూ విషెస్ చెబుతున్నారు. వాస్తవానికి చిరంజీవి(Chiranjeevi)కి , బాలయ్యకు పడడం లేదంటూ వార్తలు వచ్చినా.. చిరంజీవి స్వయంగా స్పందించడంతో ఈ వార్తలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా చిరంజీవితో పాటు వెంకటేష్ (Venkatesh), మోహన్ బాబు(Mohan Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun), కళ్యాణ్ రామ్ (Kalyan Ram), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), మహేష్ బాబు (Maheshbabu), రవితేజ (Raviteja) ఇలా పెద్ద పెద్ద హీరోలంతా స్పందించారు. అలాగే హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు కూడా బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు కానీ నాగార్జున స్పందించకపోవడంతోనే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇదే వీరి మధ్య విభేదాలు ఉన్నాయి అనడానికి ఇదే నిదర్శనం అని కూడా నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా రెండవ జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోలలో నాగార్జున , బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉంటాయి. వీరిలో బాలకృష్ణ, చిరంజీవికి మాత్రమే ఈ అత్యున్నత పురస్కారాలు లభించాయి. అంతేకాదు మోహన్ బాబుకి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. కానీ వెంకటేష్, నాగార్జున లకు మాత్రం ఎలాంటి పద్మ అవార్డులు రాలేదు.ఈ క్రమంలోనే తమ పట్ల కేంద్రానికి చిన్న చూపు ఉందని, తమను గుర్తించలేదనే కోణంలో కూడా నాగార్జున బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండి ఉంటారు అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే నాగార్జున గణతంత్ర దినోత్సవం సందర్భంగా అభిమానులకు, ప్రజలకు మాత్రం విషెస్ చెబుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ పద్మ భూషణ్ అవార్డు నాగార్జున ఇటు బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనేలా చేసిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.