BigTV English

Bandi Sanjay: పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: పద్మ అవార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు ఏ ప్రాతిపదికన పద్మశ్రీ ఇవ్వాలంటూ ఆగ్రహంతో ప్రశ్నించారాయన. గద్దర్ భావజాలం ఏంటో అందరికీ తెలుసన్నారు. ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసుల్ని హత్య చేయించారని.. మర్డర్ చేయించినవారికి అనుకూలంగా పాటలు పాడారు.. వందల మంది బీజేపీ కార్యకర్తలను మర్డర్ చేయించారంటూ ఆరోపణలు చేశారు బండి సంజయ్.


హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా.. కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందిని వెల్లడించారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోమనని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా.. గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే.. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే.. అని స్పష్టం చేశారు.


Also Read: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సమస్యలు పరిష్కరించండి!

6 గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కామెంట్స్ చేశారు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్.. బంగ్లాదేశ్ నుండి తెచ్చి ఖర్చు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే.. కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా అని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా? అంటూ ఫైర్ అయ్యారు.

 

 

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×