BigTV English
Advertisement

Nagarjuna: తెలుగు పరిశ్రమ నాకు అండగా నిలబడింది అంటే దానికి కారణం మా నాన్నగారి ఆశీర్వాదం

Nagarjuna: తెలుగు పరిశ్రమ నాకు అండగా నిలబడింది అంటే దానికి కారణం మా నాన్నగారి ఆశీర్వాదం

Nagarjuna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో అక్కినేని నాగార్జున ఒకరు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు నాగార్జున. రామ్ గోపాల్ వర్మ వంటి సంచలన దర్శకుడిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునకు దక్కుతుంది. ఇకపోతే కేవలం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, ఎన్నో ప్రేమ కథ చిత్రాలు, శివ లాంటి కమర్షియల్ సినిమాలు, అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రాలు చేసిన ఘనత అక్కినేని నాగార్జునకు దక్కుతుంది. అలానే ఇప్పటికీ కూడా చాలామంది అమ్మాయిలకు మన్మధుడు అక్కినేని నాగార్జున. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు లెగసి అద్భుతంగా కంటిన్యూ చేస్తూ ఫ్యామిలీ అంతా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అద్భుతమైన సేవలు అందిస్తుందని చెప్పాలి.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఫ్యామిలీ లానే అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా హీరోస్ ఉన్నారు. అక్కినేని నాగచైతన్య, సుశాంత్, సుమంత్, అఖిల్ వంటి హీరోలు తమకంటూ కొంత ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాతో విపరీతమైన గుర్తింపును సాధించుకున్నాడు. అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతతో కొన్ని ఏళ్ళుపాటు ప్రేమాయణం నడిపించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరూ విడిపోవలసి వచ్చింది. ఇద్దరు కూడా పరస్పర ఒప్పందంతో విడిపోయారు. ఇప్పుడు నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కొండా సురేఖ నాగచైతన్య మాజీ భార్య సమంత పై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా స్పందించింది. మునుపెన్నడు లేనివిధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ విషయంలో ఒక్కసారిగా ఏకమైంది అని చెప్పాలి. నేను ఎప్పుడూ బలమైన వ్యక్తినే,నా కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను సింహాన్ని. తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడింది.ఇదంతా మా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నా అంటూ సినీ నటుడు నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఇకపోతే మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆవిడ తిరిగి వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×