Naa Saami Ranga: కింగ్ నాగార్జున హీరోగా, డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామి రంగ’. ఈ మూవీలో కర్ణాటక బ్యూటీ ఆషిక రంగనాథ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ తరుణంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి.. అలాగే ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?.. ఎలాంటి కష్టాలు పడింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఆషికా చెప్పుకొచ్చింది.
‘నా సామి రంగ’ మూవీ షూటింగ్ కోసం కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆషిక ఒక హోటల్లో ఉండాల్సి వచ్చిందట. అయితే ఆ హోటల్ భోజనం ఆమెకు నచ్చక ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. కొన్ని రోజులు ఫుడ్ విషయంలో చాలా కష్టపడిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆమె పట్ల చాలా కేరింగ్ తీసుకున్నట్లు చెప్పింది. ఆమె హైదరాబాదులో షూటింగ్ కోసం ఉన్నన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వయంగా తన ఇంట్లో వండిన భోజనాన్ని ఆషిక కోసం ప్రత్యేకంగా నాగ్ పంపించారని తెలిపింది.
ఆయన తనపై చూపించిన ఈ స్పెషల్ కేరింగ్ వల్ల ఇంటికి దూరంగా ఉన్నానన్న ఫీలింగే రాలేదని తెలిపింది. తనకు ఇలా హైదరాబాదులో రెండవ ఇల్లు ఉండడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాటలతో నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.