సాధారణంగా రైళ్లు అప్పుడప్పడు ప్రమాదాలకు గురవుతుంటారు. క్రాసింగ్స్ దగ్గర వాహనాలు ఎదురు రావడం, పశువుల మందలు రన్నింగ్ ట్రైన్ కు అడ్డుగా రావడం వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు రైల్వే ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాజాగా ముంబైలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఇవాళ ఉదయం వంగని- బద్లాపూర్ మధ్య లోకల్ రైలు కింద రెండు గేదెలు చిక్కుకోవడంతో రైలు సడెన్ గా ఆగిపోయింది. 11:07 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన, ముంబై వైపు వెళ్లే రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. వేలాది మంది ప్రయాణీకులు తమ ప్రయాణాలను ఆలస్యంగా కొనసాగించాల్సి వచ్చింది.
వంగని సమీపంలో లోకల్ ట్రైన్ వస్తున్న సమయంలో ఒక గేదెల గుంపు పట్టాలు దాటే ప్రయత్నం చేశాయి. అయితే, రైలు వేగంగా రావడంతో ప్రమాదానికి గురయ్యాయి. చాలా గేదెలు దాటగలిగినప్పటికీ, రెండు గేదెలు మాత్రం రైలు కిందపడ్డాయి. గేదెలు నేరుగా ఇంజిన్ చక్రాలకు గట్టిగా బిగుసుకుపోవడంతో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. రైల్వే సిబ్బంది కిందికి దిగి చూసే సరికి ఇంజిన్ చక్రాలు గేదెల చర్మం, మాంసంతో చుట్టుకుపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో రైల్వే సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. సుమారు గంటపాటు కష్టపడి గేదెల చర్మాన్ని తీసేశారు. ముందుగా రైల్వే సిబ్బంది చనిపోయిన గేదెలను పక్కకు తప్పించారు. ఆ తర్వాత చక్రాల మధ్య ఇరుక్కుపోయిన మాంసం, చర్మాన్ని తీసేశారు. ఆ తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లింది.
ఈ ఘటనతో రైళ్ల రాకపోకలతో పాటు ప్రయాణీకుల మీద తీవ్రంగా పడింది. పీక్ ఆఫీస్ సమయాల్లో అంతరాయం ఏర్పడటంతో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. అయినప్పటికీ ఏం చేయలేకపోయారు. కర్జాత్ నుంచి ముంబైకి రైళ్లు నడవకపోవడంతో, బద్లాపూర్, అంబర్ నాథ్, కళ్యాణ్ లలో ప్లాట్ ఫారమ్‌లు రద్దీగా మారిపోయాయి. ప్రయాణీకులు ఎక్కువసేపు వేచి ఉండటం వల్ల తమ ఆఫీస్ కు లేట్ అవుతుందని టెన్షన్ పడ్డారు. అయినప్పటికీ వెయిట్ చేయకతప్పలేదు.
Read Also: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ ఘటన తర్వాత లైన్ ను క్లియర్ చేయడానికి, రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు, ముంబై వైపు వెళ్లే స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం సెంట్రల్ రైల్వే నెట్ వర్క్ అంతటా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అయినప్పటికీ, సబర్బన్ రైలు సేవలకు ఊహించని అంతరాయాలకు కారణం అయ్యాయి.
Read Also: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?