BigTV English

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయుల గుండెల్లో గుబులు పుట్టించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికన్ కంపెనీల్లో అమెరికన్లకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంగా విదేశీయుల మీద రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. అందులో భాగంగానే వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాల ఫీజును గణనీయంగా పెంచారు. కొత్తంగా H-1B వీసా తీసుకునే వాళ్లు ఏకంగా 1 లక్ష డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 90 లక్షలు)  చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫీజు పెంపు భారతీయులలో ప్రత్యామ్నాయ శాశ్వత నివాస ఎంపికలను అన్వేషించడానికి కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ H-1B వీసాల ఫీజు ఉన్న ఇతర దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ మనవాళ్లు అమెరికాకు ప్రత్యమ్నాయ దేశాలుగా వేటిని ఎంచుకుంటే బాగుంటుంది? ఎందుకు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ కెనడా

అమెరికాకు ప్రత్యామ్నాయ దేశాల లిస్టులో కెనడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. వృత్తి నిపుణులకు ఈ దేశం సాదర స్వాగతం పలుకుతుంది. ప్రభుత్వ రుసుములు, సెటిల్‌ మెంట్ నిధులను కలిపినా రూ. లక్ష డాలర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ వృత్తి నిపుణులకు ఆయా కంపెనీలు మంచి ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి.

⦿ ఆస్ట్రేలియా

భారతీయులకు శాశ్వత నివాసాలను అందించడంలో ఆస్ట్రేలియా మరో బెస్ట్ కంట్రీగా చెప్పుకోవచ్చు. వృత్తి నైపుణ్యాల్లో సరిపడ పాయింట్లు సాధించిన వారికి వీసాతో పాటు శాశ్వత నివాసాన్ని అందించనుంది. హోం వ్యవహారాల శాఖ ప్రకారం, 2025లో నైపుణ్యం కలిగిన వీసాలకు అధికారిక వీసా దరఖాస్తు రుసుము ప్రాథమిక దరఖాస్తుదారునికి కేవలం 4,910 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం రూ. 2,87,955.  అమెరికాతో పోల్చితే చాలా చౌక.


⦿ న్యూజిలాండ్

నైపుణ్యం కలిగిన వ్యక్తులకు పర్మినెంట్ రెసిడెంట్స్ గా గుర్తించడంలో న్యూజిలాండ్ కూడా ముందు ఉంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కేటగిరీకి నివాస వీసా ఛార్జీలు సాధారణంగా NZD 4,000–6,500 మధ్య ఉంటాయి. భారత కరెన్సీలో రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటాయి. అమెరికా H-1B రుసుముతో పోలిస్తే ప్రభుత్వ ఛార్జీలు, అవసరమైన డాక్యమెంట్స్ కూడా తక్కువగానే ఉంటాయి.

⦿ పోర్చుగల్

పోర్చుగల్ కూడా తక్కువ ఛార్జీలకే వృత్తి నిపుణులకు శాశ్వత నివాస వీసాలు అందిస్తుంది. పోర్చుగల్  D7 వీసా తక్కువ-ధరతో శాశ్వత నివాసం, పౌరసత్వం అందిస్తుంది. D7 ఆదాయ పరిమితులు మరీ అంత ఎక్కువగా ఉండవు. రిమోట్ కార్మికులు, పదవీ విరమణ చేసిన వారికి ఆకర్షణీయమైన ప్రదేశంగా ఉంటుంది. అమెరికా లక్ష డాలర్లతో పోల్చితే ఖర్చు చాలా చాలా తక్కువ.

⦿ ఐర్లాండ్, జర్మనీ సహా EU దేశాలు

అటు ఐర్లాండ్, జర్మనీతో పాటు పలు యురోపియన్ యూనియన్ దేశాలు నైపుణ్యం కలిగిన, ఫ్రీలాన్స్ ఆధారిత నివాస అనుమతులను ఈజీగా అందిస్తాయి. వీటిని దీర్ఘకాలిక నివాసంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ అనుమతుల కోసం ఖర్చు చాలా తక్కువగా ఉంటాయి.

Read Also: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Big Stories

×