Keesara News: గత కొన్నేళ్ల నుంచి పెద్దలకు ఇష్టం లేకపోయినా ఇంట్లో నుంచి పారిపోయి కూడా పెళ్లి చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇంటి నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలను ఊహించలేం.. తమ కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులను ఎంతో మందిని చూశాం. అయితే తాజాగా మేడ్చల్ జిల్లాలో సినిమా స్టైల్ లో నవవధువును తల్లిదండ్రులు కిడ్నాప్ చేసిన ఘటన చోటుచేసుకుంది. తీసుకుపోయే క్రమంలో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. కీసర పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరధిలోని నర్సంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్, శ్వేత గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే శ్వేత పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ప్రవీణ్ పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మాయి పేరెంట్స్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి పేరెంట్స్ సినిమా స్టైల్ లో శ్వేతను కిడ్నాప్ చేశారు. తమ కుమార్తె ఇష్టంలేని పెళ్లి.. చేసుకుందని పెళ్లికొడుకు ఇంటిపై దాడి చేశారు. కారులో వచ్చి మరీ కిడ్నాప్ చేశారు. తమ కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని శ్వేత పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పెళ్లికొడుకు ఫిర్యాదుతో నవవధువు కుటుంబసభ్యులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు కీసర పోలీసులు.
ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు.. ‘అమ్మాయి పేరెంట్స్ నిజంగా గ్రేట్.. డేర్ చేసి ఇంట్లో వెళ్లి దాడి చేసి మరీ అమ్మాయిని కారులో తీసుకెళ్లారు’ అని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి అమ్మాయిల వల్లే.. తల్లిదండ్రులకు గౌరవం కోల్పోతున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు.