E-Paper
Advertisement

Mahesh Babu – Namrata: బంధంలో బీటలు.. నిజం ఒప్పుకున్న నమ్రత..!

Mahesh Babu – Namrata: బంధంలో బీటలు.. నిజం ఒప్పుకున్న నమ్రత..!
Advertisement

Mahesh Babu – Namrata:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగానే కాకుండా ఆదర్శ జంటగా మిగిలిన జంటలలో మహేష్ బాబు (Maheshbabu), నమ్రత (Namrata) జంట కూడా ఒకటి. వివాహం జరిగి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీరి బంధం గురించి ఎక్కడ ఎప్పుడు ఎటువంటి రూమర్స్ వినిపించలేదు. ముఖ్యంగా వైవాహిక బంధం అంటే తప్పకుండా ఒడిదొడుకులు ఉంటాయి. అలా ఎన్నో సవాళ్లను తాము కూడా ఎదుర్కొన్నామని, ఒకసారి విడిపోయాము కూడా అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది నమ్రత. ఇక నమ్రత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బ్రేకప్ జరిగింది.. కానీ..

Advertisement

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. కళ్ళముందే విడిపోయిన సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాము కూడా ఆ జాబితాలోకే చేరిపోతాము అంటూ నమ్రత తెలిపింది. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, నమ్రత కూడా విడిపోయారు. కానీ వీళ్లు అందరిలాగా కాకుండా విడిపోయినా.. బంధం విలువ తెలుసుకొని మళ్లీ కలిసిపోయి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడింది.

మేము కూడా విడిపోయాం – నమ్రత

Advertisement

నమ్రత మాట్లాడుతూ.. “నేను చెప్పే ఈ విషయం అందరికీ ఆశ్చర్యంగా అనిపించినా.. ఇదే నిజం. ఒకప్పుడు మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే మా తల్లిదండ్రులను కూడా నేను కోల్పోయాను. మా మధ్య కొన్ని అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. దాంతో నేను మహేష్ బాబుతో కలిసి ఉండలేక నా కొడుకు గౌతమ్ ను తీసుకొని, ముంబైకి వెళ్ళిపోయాను. కొన్నాళ్లు మేము విడిపోయాము. అయితే అలా విడిపోవడంతోనే మా బంధం ఎంత బలమైందో మాకు అర్థమైంది. ఆ తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేక మళ్ళీ కలిసిపోయాము. ఇక కలిసిపోయిన తర్వాతనే మాకు సితార జన్మించింది” అంటూ నమ్రత తెలిపింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విడిపోయినా సరే ఆ విషయాన్ని బయట పెట్టకుండా మళ్లీ తప్పును తెలుసుకొని కలిసిపోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా జంటలు కూడా మీలాగే ఉంటే ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ బ్రేకప్ అనే విషయం ఉండదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

కెరియర్ కోల్పోవడం పై నమ్రత కామెంట్..

వివాహం తర్వాత తాను తన కెరీర్ ను కోల్పోవడంపై కూడా నమ్రత మాట్లాడింది. “వివాహం జరిగిన తర్వాత నేను పని చేయాలని మహేష్ కోరుకోలేదు. మేము రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు. నేను హీరోయిన్ గా ఉన్నానని కాదు, నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ కూడా మహేష్ నన్ను ఆ జాబ్ మానేయమని చెప్పేవాడు. స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు లేదు. కాబట్టి నా కెరియర్ అంతమవుతున్నప్పటికీ కూడా నాకు బాధ కలగలేదు” అంటూ నమ్రత తెలిపింది. ఇక ఇప్పుడు అన్నింటికీ దూరంగా బర్త్డే సర్వస్వంగా కుటుంబ బాధ్యతలు మోస్తోంది నమ్రత. అంతేకాదు మహేష్ బాబుకు చెందిన ప్రతి విషయాన్ని ఆమె చూసుకుంటూ ఆయనకు వెన్నెముకగా నిలిచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×