BigTV English

Trump Ukraine Russia War: పుతిన్‌తో డీల్ చేయడం ఈజీ.. వినకపోతే ఆంక్షలు, సుంకాలు విధించడమే

Trump Ukraine Russia War: పుతిన్‌తో డీల్ చేయడం ఈజీ.. వినకపోతే ఆంక్షలు, సుంకాలు విధించడమే

Trump Ukraine Russia War| రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ రష్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాతో డీల్ చేయడం చాలా సులభమని ఉక్రెయిన్‌తో కష్టమని పేర్కొన్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.


“ఉక్రెయిన్ వద్ద అంత బలం లేదు.. అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది. రష్యాతో డీల్ చేయడం చాలా సులభం. ఆ దేశాధ్యక్షుడు పుతిన్ పై నాకు విశ్వాసం ఉంది. నాకు అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడు” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే నిన్న రాత్రి.. మాస్కో దళాలు రాత్రివేళ ఉక్రెయిన్ భూభాగంపై భీకర దాడులు చేయడానికి గల కారణం తనకు అర్థమైందన్నారు. వాస్తవానికి ఆ స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారో పుతిన్ కూడా అదే చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు శాంతి ఒప్పందానికి అంగీకరించే ముందు ఉక్రెయిన్ భద్రతా హామీకి ఒత్తిడి చేస్తుందన్నారు. ఇది కాల్పుల విరమణ.. శాంతి ఒప్పందాల్లో అమెరికా ప్రమేయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Also Read: ఇండియా మేరా దోస్త్.. స్వరం మార్చిన చైనా!


ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో రష్యా పై బ్యాంకింగ్ ఆంక్షలు, సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పలు దేశాల పై సుంకాల విధింపుతో దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా రష్యా పై దృష్టి సారించారు. రష్యా పై భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

“ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న కారణంగా.. రష్యా పై భారీ స్థాయిలో బ్యాంకింగ్ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాలు విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాను. ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయి” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆలస్యం కాకముందే రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒకవేళ పుతిన్ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు ఉంటాయని హెచ్చరించారు.

అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చల సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదం విచారకరమని జెలెన్‌స్కీ పేర్కొన్న సంగతి తెలిసిందే. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బలమైన తుది ఒప్పందం కోసం అమెరికా తో కలిసి పనిచేస్తామని జెలెన్‌స్కీ చెప్పారు.

Also Read: ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా

తాత్కాలిక కాల్పుల విరమణకు మేము సిద్ధం : రష్యా
ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు కొన్ని షరతుల మేరకు తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమేనని రష్యా పేర్కొంది. ఇటీవల అమెరికా ప్రతినిధులతో శాంతి ఒప్పందంపై జరిగిన చర్చల్లో తుది పరిష్కారానికి తమ అభ్యర్థనలను తెలిపినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×