Belly Fat: ఎవరైనా బరువు తగ్గాలని అనుకుంటే వారు చేసే మొదటి పని ఆహారం తినడం తగ్గించి నుండి రోటీ తినడం. రోటీ, అన్నం రెండూ శరీరాన్ని శక్తివంతం చేయడంలో సహాయపడే కార్బోహైడ్రేట్లు కలిగిన వనరులు. రోటీ , అన్నం అధికంగా తినడం వల్ల మీ బరువు వేగంగా పెరుగుతుంది . కార్బోహైడ్రేట్లతో పాటు, ఇందులో అధిక కేలరీలు కూడా ఉంటాయి. అందుకే ఫిట్‌నెస్ ప్రియులు తక్కువ కేలరీలు కలిగిన , శరీరానికి శక్తిని అందించే ఆరోగ్యకరమైన ఫుడ్ లేదా డ్రింక్స్ కోసం చూస్తారు.
మీరు మీ బరువు తగ్గించే ప్రయాణంలో రోటీ , అన్నానికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే మీకు కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తాయి. ఈ బరువు తగ్గించే డ్రింక్స్ మీ శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గించుకోవడానికి సహాయపడటమే కాకుండా, మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలు:
పసుపు పాలలో అనేక పోషకాలు ఉంటాయి. పసుపు పాలు జలుబు , దగ్గు వంటి వాటిని తగ్గించడానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. ఇది కొవ్వు నిల్వను నియంత్రిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని సరళంగా చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
మజ్జిగ :
వేసవిలో తీసుకునే మజ్జిగ కూడా మీ బరువు తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే మజ్జిగ మీ కడుపు చాలా సేపు నిండిన ఉండే అనుభూతిని కలిగిస్తుంది. పెరుగుతో మజ్జిగ తయారు చేస్తారు. ఇది శరీరంలో ప్రోబయోటిక్స్ , ప్రోటీన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మీకు 3-4 గంటల పాటు ఆకలి వేయదు. భోజనం తర్వాత మజ్జిగ కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది.
అరటిపండుతో స్మూతీ:
స్మూతీలను అల్పాహారంలో భాగంగా తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇది రోటీ , పరాఠాలకు గొప్ప ప్రత్యామ్నాయం అవుతుంది. అరటిపండు , ఖర్జూరంతో తయారు చేసిన స్మూతీ మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది రాత్రి భోజనం సమయంలో కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. స్మూతీని మరింత రుచికరంగా చేయడానికి పాలు, బాదం , తేనెను కూడా ఉపయోగించవచ్చు. వీటిని వాడటం వల్ల ఈ స్మూతీకి మంచి రుచి కూడా వస్తుంది. అంతే కాకుండా వీటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.
Also Read: అరటి పండ్లు త్వరగా.. పాడవకుండా ఉండాలంటే ?
నారింజతో డ్రింక్ :
బరువు తగ్గించడంలో సిట్రస్ పండ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ పండ్లు మీ బరువు తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. నారింజతో తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఎ , యాంటీ-ఆక్సిడెంట్లు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం ద్వారా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దీనిని తరచుగా తాగడం వల్ల రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది. నారింజతో తయారు చేసిన డ్రింక్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి కూడా తాగవచ్చు.