E-Paper
Advertisement

Namratha: మహేశ్‌.. వాళ్లకు మీరొక ఎమోషన్‌..: నమ్రత ఆసక్తికర పోస్ట్‌

Namratha: మహేశ్‌.. వాళ్లకు మీరొక ఎమోషన్‌..: నమ్రత ఆసక్తికర పోస్ట్‌
Advertisement
Tollywood celebrity news

Namratha news telugu(Tollywood celebrity news):

మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ మూవీ మరికొద్ది రోజుల్లో అంటే జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా.. అందులో మహేశ్ స్పీచ్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా సినిమా విడుదలైతే బ్లాక్ బస్టరే. కానీ ఇప్పుడు నాన్న లేరు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న, అన్నీ’’ అని అన్నారు. దీంతో మహేశ్ ఎమోషనల్ స్పీచ్‌కి అంతా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

‘‘మహేశ్ గురించి ఎంతోమంది ఇప్పటికే గొప్పగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అతనిపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. ఆ ప్రేమతోనే అతనిని మరింత కష్టపడి పనిచేసేలా చేశారు. ఇక గుంటూరు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఉద్దేశించి.. గుంటూరులో అభిమానుల చూపించిన ప్రేమను చూసి ఓ విషయాన్ని గర్వంగా చెప్పాలనుంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×