BigTV English

Family Suicide : అప్పుల బాధ.. కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పిల్లలను బతికించి.. తల్లి మృతి..

Family Suicide : అప్పుల బాధ.. కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పిల్లలను బతికించి.. తల్లి మృతి..

Family Suicide : చీటీల వ్యాపారం ఆ కుటుంబాన్ని అప్పులపాలు చేసింది. విధిలేని పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ ఆత్మాహత్యాయత్నం చేసింది. భార్యభర్తలు విషం తాగారు. భార్య ప్రాణాలు కోల్పోయింది. భర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విజయవాడలోని శాంతినగర్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.


విజయవాడ పాయకాపురం శాంతినగర్ లోని అంబటి ప్రతాప్ కుమార్ ప్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య సాయికన్య చీటీల ప్యాపారం చేసేది. ఈ క్రమంలో వ్యాపారంతో అప్పులపాలయ్యారు. దీంతో వాళ్ల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. 20 లక్షల రూపాయలు అప్పులపాలయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామని భార్యాభర్త మాట్లాడుకున్నారు. అనుకున్నట్టే విషం తెచ్చుకున్నారు. పల్పీ ఆరెంజ్‌లో కలిపి పిల్లలకు తాగించాలని ప్లాన్ చేశారు. పల్పీ ఆరెంజ్‌లో విషం కలిపారు కూడా. నలుగురికి నాలుగు గ్లాసులు తాగాలనుకున్నారు.

ఎంత కష్టమొచ్చినా అమ్మ అమ్మే. పిల్లల విషయంలో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. జ్యూస్ అనుకుని పిల్లలు విషం తాగుతున్న దృశ్యం ఆ తల్లికి బతికుండగానే నరకం చూపించింది. వాళ్ల చేతుల్లోని గ్లాసులు లాక్కుని తానే తాగేసింది. ఒక గ్లాసుడు విషం తనది. రెండు గ్లాసుల విషం పిల్లలకి ఇచ్చినంది. మొత్తం 3గ్లాజులు తాగేసింది. దీంతో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లల ముందే గిలగిల గింజుకుంటూ ఆమె ప్రాణాలు విడిచింది.


ఇంతలో భర్త ప్రతాప్ కుమార్ కూడా విషం తాగాడు. అతడు కూడా కిందపడి విలవిల్లాడుతుంటే ఆ ఇద్దరు పిల్లలకు అర్థం కాలేదు. ఏం జరిగిందో కూడా ఊహించలేకపోయారు. బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లి స్థానికుల్ని పిలుచుకొచ్చారు. వాళ్లు ప్రతాప్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకోని పరిశీలంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×