E-Paper
Advertisement

Akash Deep Sabir: 100 కోట్లు ఇస్తేనే ఇంట్లో వాచ్ మెన్ ను పెడుతుందేమో.. కరీనాపై నటుడు సెటైర్

Akash Deep Sabir: 100 కోట్లు ఇస్తేనే ఇంట్లో వాచ్ మెన్ ను పెడుతుందేమో.. కరీనాపై నటుడు సెటైర్
Advertisement

Akash Deep Sabir:  ఇండస్ట్రీలో స్టార్స్ ఎంతెంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటారో అందరికి తెల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ రూ. 50 కోట్లు కంటే పైనే తీసుకుంటూ ఉంటారు. ఇక స్టార్స్  ఇళ్ల దగ్గర ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందో కూడా చూస్తూనే ఉన్నాం. వారు బయట కానీ, లోపల కానీ కనిపించకపోయినా.. నిత్యం వారి ఇళ్లు కెమెరాలతో, సెక్యూరిటీల నిఘాలో ఉంటాయి. అంత నిఘాలో ఉన్నా కూడా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఇంట చోరీకి పాల్పడ్డారు  నిందితులు. వెనుక డోర్ నుంచి లోపలి వచ్చి … సైఫ్ చిన్న కొడుకు రూమ్ లోకిదూరి  రచ్చ చేశాడు. ఆ రూమ్ లో సౌండ్ వస్తుందని వెళ్లి చూసిన సైఫ్ ను కత్తితో దాడి చేశాడు. వెంటనే సైఫ్ కొడుకు ఇబ్రహీం .. తండ్రిని ఆటోలో హాస్పిటల్ కు తరలించాడు.

ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మధ్యనే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు.  అయితే సైఫ్ దాడి కేసులో చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక పెద్ద స్టార్  ఇంటివద్ద ఫుల్ టైమ్ వర్క్ చేసే వాచ్ మెన్ లేడా.. ? చివరకు కార్లు తీయడానికి డ్రైవర్స్ లేరా.. ? అని మాట్లాడుకున్నారు. తాజాగా ఇదే అనుమానాన్ని బాలీవుడ్ నటుడు ఆకాష్ దీప్ సబీర్ కూడా వ్యక్తపరిచాడు.

Advertisement

ఒక ఇంటర్వ్యూలో ఆకాష్ .. నటీనటుల భద్రత , వారి పారితోషికాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్స్ కోట్లు తీసుకుంటున్నా కూడా ఇంటికి సరైన భద్రత ఉండడం లేదని వాపోయాడు. అంతేకాకుండా సైఫ్ కేసు గురించి కూడా మాట్లాడాడు. ” కరీనా కపూర్ ఖాన్ నాకు చిన్నతనం నుంచి తెలుసు. ఆమె సోదరి కరిష్మా  కపూర్ నటించిన మొదటి సినిమాకు నేనే దర్శకత్వం వహించాను.  కరీనా- సైఫ్ మంచి జోడీ. సైఫ్ కు జరిగిన దాడి గురించి విన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ దాడి కేసును ఛేదించాలని అభిమానులు పోరాడుతున్నప్పుడు నేను కూడా అందులో ఉన్నాను.

Tollywood: 110 చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం.. ఆ ఒక్క కారణంతో ఇండస్ట్రీ నుండి దూరం.. ఎవరంటే?

Advertisement

అయితే నాకు ఇప్పటికీ తెలియని రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు అడిగినా నేను వాటికి సమాధానం చెప్పలేకపోయాను. సైఫ్ – కరీనా ఇంట్లో ఫుల్ టైమ్ వాచ్ మెన్ లేడా.. ? ఇంత స్టేటస్ ఉండి, డబ్బు ఉండి.. వారెందుకు సెక్యూరిటీని పెట్టించుకోలేదు. అర్ధరాత్రి.. అపరాత్రి ఏదైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళడానికి డ్రైవర్స్ లేరా.. ? అని. నేను వాటికి బదులు చెప్పలేకపోయాను.  కరీనాకు రూ. 21 కోట్లు పారితోషికం వస్తుంది. రెమ్యూనరేషన్ ఎప్పుడు హీరో ఇమేజ్ ను బట్టి ఉంటుంది.

పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రూ. 100 కోట్లు తీసుకున్నాడు. రష్మిక కేవలం రూ. 10 కోట్లు మాత్రమే అందుకుంది.  అల్లు అర్జున్ ను చూసే ప్రేక్షకులు సినిమాకు వస్తారు.. హీరోయిన్ ను చూసి కాదు. అలాగే కరీనా రూ. 21 కోట్లు అందుకున్నా కూడా ఇంటివద్ద ఫుల్ టైమ్ వాచ్ మెన్ ను  పెట్టుకోలేకపోయింది. రూ. 100 కోట్లు ఇస్తే అప్పుడు పెట్టుకుంటుందేమో” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆకాష్ వ్యాఖ్యలను నెటిజన్స్ కూడా సపోర్ట్ చేయడం విశేషం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×