BigTV English
Advertisement

Nandamuri Mokshagna : నందమూరి హీరో డెబ్యూ అంటే మామూలుగా ఉండదు మరీ… ఏకంగా బాలీవుడ్‌నే దింపేస్తున్నారు..

Nandamuri Mokshagna : నందమూరి హీరో డెబ్యూ అంటే మామూలుగా ఉండదు మరీ… ఏకంగా బాలీవుడ్‌నే దింపేస్తున్నారు..

Nandamuri Mokshagna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna).. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా అడుగుపెట్టి యుక్తవయసులోనే పదుల సంఖ్యలో సినిమాలు చేసి, ఆ తర్వాత హీరోగా మారి మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా అలరించిన ఈయన ఇటీవల ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించింది కూడా. ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలలో కూడా వరుస విజయాలను అందుకుంటూ విజయపరంపర కొనసాగిస్తున్నారు.


#Mokshagna1 నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్..

ఇకపోతే ఈయన తదనంతరం ఈయన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అంటూ వార్తలు విపరీతంగా వినిపించిన నేపథ్యంలో ఆయన తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దాదాపు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఐదు సంవత్సరాలు వేచి చూడక తప్పలేదు. కానీ ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మొదటి సినిమా #Mokshagna 1 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి అడుగుపెట్టిన మోక్షజ్ఞ కచ్చితంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. దీనికి తోడు మోక్షజ్ఞ సోదరి తేజస్విని(Tejaswini ) ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించబోతోంది..అంతేకాదు తన తమ్ముడి చిత్రంతో మొదటిసారి ఆమె నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే.


మోక్షజ్ఞ మూవీ కోసం రంగంలోకి దిగిన బాలయ్య..

ఇకపోతే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా సినిమాను విడుదల చేయాలని , బడ్జెట్ విషయంలో ఏమాత్రం లోటు రాకూడదని నందమూరి బాలకృష్ణ నిర్మాతలకు తెలియజేశారట. అంతేకాదు కొడుకు మూవీ విషయంలో అన్నీ కూడా జాగ్రత్తగా ముందుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నందమూరి మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అంటూ వార్తలు రాగా.. గతంలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు స్టార్ కిడ్ ను రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

మోక్షజ్ఞ సరసన స్టార్ కిడ్..

అందులో భాగంగానే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి మోక్షజ్ఞ సరసన అనిల్ తడాని లేదా సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరిని మోక్షజ్ఞకు జోడిగా నటింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మోక్షజ్ఞ సరసన స్టార్ కిడ్ రవీనా టాండన్ కూతురు రాషా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇద్దరిలో ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారో చూడాలి. మొత్తానికి అయితే తన కొడుకు మొదటి సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ నే బాలయ్య దింపబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ సినిమాలు..

బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ హీరోగా సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య. ఇప్పటివరకు ఆయన సినీ కెరియర్ లో ఇలాంటి పాత్ర జోలికి వెళ్లలేదు. పైగా తెలుగులో ఇలాంటి సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలు కూడా రాలేదు. మరి బాలయ్య కొత్త ప్రయోగం ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×