BigTV English

Durga Mata Idol Vandalised: విగ్రహం ధ్వంసం కేసులో ఒకరి అరెస్ట్.. ఘటనకు అసలు కారణం చెప్పిన డీసీపీ

Durga Mata Idol Vandalised: విగ్రహం ధ్వంసం కేసులో ఒకరి అరెస్ట్.. ఘటనకు అసలు కారణం చెప్పిన డీసీపీ

Durga Mata Idol Vandalised: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం పట్ల జరిగిన అపచారంకు బాధ్యుడైన కృష్ణయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ తెలిపారు.


నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం ధ్వంసమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని కావాలనే ధ్వంసం చేశారన్న ఆరోపణలను పలు హిందూ సంఘాలు ఆరోపించాయి. ఈ కేసును త్వరితగతిన ఛేదించాలన్న లక్ష్యంతో సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడ్డ పోలీసులు అసలేం జరిగిందనే అంశాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ దర్యాప్తులో వారికి అసలు నిజం తెలిసింది.

ఈ క్రమంలో అమ్మవారి విగ్రహం పట్ల జరిగిన అపచారంకు బాధ్యుడిగా నాగర్ కర్నూల్ కి చెందిన కృష్ణయ్య గౌడ్ ను పోలీసులు గుర్తించారు. ఇతడిని బేగం బజార్ ఫిల్కాన్ చౌరస్తా వద్ద అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల మేరకు.. విగ్రహం ధ్వంసం చేశారంటూ కేసు అందిన వెంటనే తాము దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. అయితే విగ్రహం ఏర్పాటు చేసిన మండపం వద్ద నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని.. అందుకే నిర్వాహకునిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. కృష్ణయ్య గౌడ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అతను డిప్రెషన్ లో ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.


నిన్న రాత్రి బతుకమ్మ పండుగ జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు కృష్ణయ్య గౌడ్.. ఆకలితో వచ్చి, తనకు తినేందుకు ఎటువంటి ఆహారం దొరకక పోవడంతో అక్కడున్న వస్తువులన్నింటిని చిందరవందరగా పడవేశాడని, ఆ క్రమంలోనే విగ్రహం ధ్వంసమైనట్లు డిసిపి తెలిపారు.

Also Read: Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

కొందరు ఈ విషయాన్ని కావాలనే సోషల్ మీడియా ద్వారా పుకార్లు సృష్టించారన్నారు. అంతేకాకుండా మత విద్వేషాలు సృష్టించేందుకు పలువురు ప్రయత్నించారని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రచారం చేయడం తగదన్నారు. అయితే సంచలనం కలిగించిన నాంపల్లి ఘటనలో భాద్యుడిని అనతి కాలంలోనే గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Related News

Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

GHMC Hyderabad: హైదరాబాద్‌లో.. ఇన్ని లక్షల గణేషుడి ప్రతిమలా! జీహెచ్ఎంసీ కీలక ప్రకటన!

Hyderabad Tank Bund: గణనాథుడి నినాదాలతో మార్మోగిన హైదరాబాద్.. శోభాయాత్రలో పోలీసుల డాన్స్

Hyderabad Water: హైదరాబాద్‌లో రెండు రోజులు నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Big Stories

×