BigTV English

Nandini Reddy Sister Death: అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట తీవ్ర విషాదం..!

Nandini Reddy Sister Death: అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట తీవ్ర విషాదం..!

Nandini Reddy Sister Shanthi Passed Away: టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరి శాంతి కన్నుమూసింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ” ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం అంత సులభం కాదు.. నాతో పెరిగిన వ్యక్తిని కోల్పోవడం ఇదే మొదటిసారి. నన్ను మొదటగా అక్కా అని పిలిచింది శాంతినే.. నాకు తెలిసిన అత్యంత దయగల వ్యక్తి. ఆమె కల్మషం లేని నవ్వు మరియు సున్నితమైన బలం ఆమె వ్యక్తిత్వాన్ని నిర్వచించాయి.


ఆమె గత నాలుగు నెలలుగా అదే ప్రశాంత శక్తితో అద్భుతమైన యుద్ధం చేసింది. దురదృష్టవశాత్తూ ఈరోజు లోకాన్ని విడువాల్సిన సమయం వచ్చింది. శాంతి ఉత్తమ కుమార్తె, సోదరి, భార్య, తల్లి మరియు స్నేహితురాలు. మేము నిన్ను మిస్ అవుతాము. నా ప్రియమైన సోదరి మళ్లీ వేరే ప్రపంచంలో ఎదురుగా కలిసే వరకు… వీడ్కోలు” అంటూ చెప్పుకొచ్చింది ఇక నందిని రెడ్డి చెప్పిన దాని ప్రకారం శాంతి గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయిందని తెలుస్తోంది. దీంతో నందిని ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: Tamil Hero Vijay: అప్పుడు విద్యార్థినికి డైమండ్‌ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు.. ఇప్పుడు మళ్లీ..


ఇక అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి చాలా రేర్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. గతేడాది అన్ని మంచి శకునములే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నందిని ఒక కొత్త కథతో రానుందని టాక్ నడుస్తోంది. మరి ఏ హీరోతో నందిని హిట్ అందుకుంటుందో చూడాలి.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×