BigTV English

Yeto Vellipoyindi Manasu Re Release: నాటి రోజుల్ని గుర్తుకుతెచ్చే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ.. ప్రేమ ప్రేక్షకుల కోసం మళ్లీ వస్తుంది..

Yeto Vellipoyindi Manasu Re Release: నాటి రోజుల్ని గుర్తుకుతెచ్చే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ.. ప్రేమ ప్రేక్షకుల కోసం మళ్లీ వస్తుంది..

Yeto Vellipoyindi Manasu Re Release: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అప్పట్లో రిలీజ్ అయి ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు కూడా రీ రిలీజ్‌లో అదరగొడుతున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా సత్తా చాటాయి.


ఇక ఇప్పుడు మరొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. అదే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ హీరోయిన్ సమంత నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీగా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించారు.

Also Read: ఇప్పటికీ నాలో ఆ సత్తా ఉంది: కరీనాకపూర్


గత పన్నెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ గుండెల్ని పిండేస్తాయనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. ‘ఏది ఏది కుదురేది ఏది’ అనే సాంగ్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ వింటూ అలా హాయిగా నిద్రపోవచ్చు. అయితే ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా సినిమాలో అన్ని సాంగ్స్ ఇలాంటి ఫీల్‌నే అందిస్తాయి. ఇళయరాజా సంగీతం ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. వచ్చే నెల ఆగస్టు 2వ తేదీన ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేమ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నాని అండ్ సమంత క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్‌ని వీక్షించేందుకు చాలా ఆతృత పడుతున్నారు. మళ్లీ ఈ సినిమాను చూస్తూ నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఎంతో మంది సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా రీ రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×