BigTV English

Dasara: ‘చమ్కీల అంగి వేసి’.. సోషల్ మీడియాను షేక్ చేసి.. సింగర్ స్పెషాలిటీ ఇదే..

Dasara: ‘చమ్కీల అంగి వేసి’.. సోషల్ మీడియాను షేక్ చేసి.. సింగర్ స్పెషాలిటీ ఇదే..

Dasara Movie: హీరో నాని నటించిన తాజా చిత్రం దసరా. కీర్తిసురేష్‌ హీరోయిన్. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. పాటలు సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ను క్రియేట్‌ చేశాయి.’చమ్కీల అంగీ వేసి’ సాంగ్​ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మధ్య ఎక్కడ చూసినా అందరి ఫోన్​లలో ఆ పాటే వినిపిస్తోంది. సినీప్రియులు సరదాగా ఆ పాటను హమ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు స్టెప్పులేసి రీల్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతలా పాపులరయ్యింది ఈ సాంగ్​. అచ్చమైన తెలంగాణ యాసలో పూర్తి మాస్​ బీట్‌లో ఉన్న​ ఈ సాంగ్​ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.


సింగర్ ఎవరో తెలుసా..?
‘చమ్కీల అంగీ వేసి’ సాంగ్ పాడిన సింగర్‌కు ఒక రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెడింగ్‌లో ఉంది. “చమ్కీల అంగీ వేసి” లిరికల్​ వీడియోలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. ఆమె గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ గాయని తమిళ సింగర్​ ధీ. ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు సంతోశ్​ నారాయణన్​ గారాల పట్టి. ఈయనే దసరా సినిమాకు మ్యూజిక్​ డైరెక్టర్​. ఈ గాయని అసలు పేరు దీక్షితా వెంకటేషన్. ఆమె స్టేజ్ పేరు ధీ. ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. 14 ఏళ్లు వయస్సు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికే తమిళంలో ఎన్నో పాటలు పాడింది. కోలీవుడ్ బాగా ఫేమస్ అయ్యింది. గురు సినిమాలో ఓ సక్కనోడా, మారి2 మూవీలో రౌడీ బేబీ, ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే సాంగ్స్ ఆమె పాడినవే. లాక్ డౌన్ సమయంలో ఎంజాయ్ ఎంజామీ అనే ఆల్బమ్‌తో ఉర్రూతలూగించింది.

భారీ అంచనాల మధ్య దసరా మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడటంతో ఇప్పటికే ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే మరో వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. పక్కా విలేజ్‌ బ్యాక్‌గ్రాండ్‌లో మాస్‌ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కిన ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×