BigTV English

Ramadan Moon : రంజాన్ చంద్రుడిని చూడడానికి సైంటిఫిక్ సూచనలు..

Ramadan Moon : రంజాన్ చంద్రుడిని చూడడానికి సైంటిఫిక్ సూచనలు..
 Ramadan Moon

Ramadan Moon : రంజాన్ మాసం మొదలయ్యింది. ప్రతీ సాంప్రదాయ పండుగ వెనుక, నమ్మకం వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉంటుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతారు. అలాగే రంజాన్ వెనుక కూడా ఒక సైంటిఫిక్ కారణం ఉంటుందని వారు అంటున్నారు. రంజాన్ మాసంలో వచ్చే చంద్రుడిపై ఇప్పటికే వారు ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే రంజాన్ చంద్రుడితో కళ్లతో నేరుగా చూడవచ్చా లేదా అనే అంశంపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


రంజాన్ మాసంలో ముందు మూడు రోజులు వచ్చే చంద్రుడి వెలుగును హిలాల్ అంటారు. ఆ తర్వాత దానిని ఖమర్ అని పిలుస్తారు. హిలాల్ వెలుగును హల్లా అని సంబోధిస్తూ పూజలు చేస్తారు. దానిని దేవుడి నుండి వచ్చే వెలుగని నమ్ముతారు. మామూలుగా రంజాన్ మాసంలో వచ్చే చంద్రుడిని కంటితో చూస్తేనే మంచిదని కొందరు పెద్దలు భావిస్తారు. రువాత్ ఈ హిలాల్ అనే కమిటీ రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని నిర్ధారిస్తారు.

పలు అభివృద్ధి చెందిన దేశాల్లో మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్.. రువాత్ ఈ హిలాల్ కమిటీకి రంజాన్ మాసాన్ని నిర్ణయించే విషయంలో సాయం చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల రంజాన్ చంద్రుడిని చూడడానికి కొత్త రకమైన టెక్నాలజీలు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకు కూడా వచ్చింది. మునుపటితో పోలిస్తే.. ఇప్పుడు హై రెజల్యూషన్ టెలిస్కోప్‌లు, స్కై గేజెంగ్ యాప్స్ అనేవి మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. ఇవి రంజాన్ చంద్రుడిని క్షుణ్ణంగా చూడడానికి ఉపయోగపడతాయని కొందరు భావిస్తున్నారు.


నిపుణులు మాత్రం రంజాన్ చంద్రుడిని చూసే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఎప్పటినుండో రంజాన్ చంద్రుడిని ఏ పరికరం లేకుండా కంటితో చూడడం ఆనవాయితీగా వస్తోంది. అదే సాంప్రదాయం అని కూడా కొందరు భావిస్తున్నారు. ఉన్నట్టుండి టెక్నాలజీ పెరగడాన్ని కారణంగా చూపించి ఆ సాంప్రదాయాన్ని మార్చకూడదని కొందరు అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం టెక్నాలజీలో వచ్చిన అప్డేట్స్‌ను చంద్రుడిని చూడడం కోసం ఉపయోగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ (ఐఏయూ) రంజాన్ చంద్రుడిని చూడడానికి ఒక కొత్త క్రైటీరియాను సిద్ధం చేసింది. ఎన్నో సైంటిఫిక్ లెక్కలతో ఈ క్రైటీరియా సిద్ధం చేయబడింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా చంద్రుడిని చూడడం కోసం ఈ టెక్నాలజీని అలవాటు చేసుకున్నాయి. టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా సాంప్రదాయ పద్ధతిని పాటించడం అనేది వ్యక్తిగతమైన నిర్ణయమని నిపుణులు చెప్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×