Nani: ప్రముఖ దర్శకులు బాపు గారి దగ్గర రాధాగోపాలం సినిమాకి శిష్యరికం చేశాడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన అష్టాచమ్మా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ మంచి పేరును సాధించుకున్నాడు. నాని కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. నాని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అంచలంచెలుగా ఎదిగి నేడు తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. నాని సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే ఆడియన్స్ కూడా ఉన్నారు. అందరు హీరోలులా కాకుండా ప్రత్యేకమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు నాని. స్వతహాగా నాని కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో చాలామంది డైరెక్టర్లను గుర్తిస్తున్నాడు. నానితో పని చేసిన దర్శకులకి అవార్డులు కూడా వస్తున్నాయి.
రీసెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి శ్రీకాంత్, శౌర్యవ్ అని ఇద్దరు దర్శకులను పరిచయం చేశాడు నాని. వాళ్ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇలా జరగటం అనేది అరుదైన విషయం. ఇకపోతే కేవలం తెలుగు దర్శకులతో మాత్రమే కాకుండా తమిళ్ దర్శకులతో కూడా నాని ఒకప్పుడు సినిమాలు చేశాడు. శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన డాన్ (Don) సినిమా దర్శకుడు శిబి కూడా నానికి ఒక కథను చెప్పాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో మలయాళం దర్శకుడు నాని తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జయ జయ జయహే సినిమా తీసిన విపిన్ దాస్ తో నాని సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : Posani Krishna Murali: నటుడు పోసాని పై రాష్ట్రవ్యాప్తంగా 50 కి పైగా కేసులు నమోదు
ఇక ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 అనే సినిమాను చేస్తున్నాడు నాని. ఈ సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ వీడియో సినిమా మీద మంచి అంచనాలను పెంచింది. అలానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తన రెండవ సినిమాను కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్యారడైజ్ అని టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ ఇదివరకే నాని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. వేణు దర్శకత్వంలో నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమాని చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి నితిన్ ఎంటర్ అయ్యాడు ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు.