Posani Krishna Murali: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రతిభావంతులైన నటులు రచయితలు ఉన్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ సినిమాలకు అద్భుతంగా డైలాగులు రాస్తున్న తరుణంలో అప్పుడప్పుడే కెరియర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుని, ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించాడు పోసాని కృష్ణ మురళి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు పోసాని కృష్ణ మురళి దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అయితే ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి వేరు . ఇప్పుడు పోసాని కృష్ణ మురళి వేరు. పోసాని కృష్ణ మురళి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత తనకు చాలా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రెస్ మీట్స్ లో పోసాని కృష్ణ మురళి మాట్లాడిన విధానం చాలామందికి నచ్చేది కాదు. చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ ని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
Also Read : Best romantic movies on OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ సౌత్ ఇండియన్ రొమాంటిక్ మూవీస్..
ఇక పోసాని కృష్ణ మురళి ఎన్నో అద్భుతమైన సినిమాలకు డైలాగులు అందించారు. ఆ తర్వాత నటుడుగా కూడా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. దర్శకుడుగా కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒకప్పుడు పోటీ కూడా చేశారు. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఒకప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన వారందరిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. చాలామంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇక నటుడు పోసాని పై రాష్ట్రవ్యాప్తంగా 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. పోసాని అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అలానే శ్రీ రెడ్డి పై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also Read : Matka OTT : మెగా హీరో యాక్షన్ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి చాలామంది దర్శకులు ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి దగ్గర పనిచేసిన వాళ్లే. అయితే రైటర్లకి సరైన గుర్తింపు లేదు. వాళ్లకు మంచి గుర్తింపు ఉండాలి. వాళ్ళు పని చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉండాలి. అని అప్పట్లో పోసాని కృష్ణమురళి నిర్మాతలతో గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం తను తీసిన సినిమా టైటిల్ లానే పోసాని కృష్ణ మురళి కాస్త మెంటల్ కృష్ణ అయిపోయాడంటూ అక్కడ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. పోసాని అరెస్టు పైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా పోసాని కృష్ణ మురళికి పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి.