EPAPER

Nani: నానీ సరిపోదా ఈ ఫెయిల్యూర్..దెబ్బ పడిందిగా

Nani: నానీ సరిపోదా ఈ ఫెయిల్యూర్..దెబ్బ పడిందిగా

Nani movie Saripodhaa Sanivaram not achieved break even collections: నాని అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే నమ్మకాన్ని కలిగించాడు గత సినిమాల కలెక్షన్లతో. అయితే ఈ సారి మాత్రం బయ్యర్లకు కాస్త అటూ ఇటూగా నష్టాలనే మిగిల్చాడు తన సరిపోదా శనివారం మూవీతో. విడుదలకు ముందే హైప్ తెచ్చిన సరిపోదా శనివారం విడుదలయ్యాక ఫరవాలేదనిపించుకునే టాక్ తో వచ్చింది. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నాన్న మూవీలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుని హిట్ దిశగా పయనించాయి. పంపిణీదారులకు కూడా లాభాలనే తెచ్చిపెట్టాయి. అయితే సరిపోదా శనివారం మూవీకి దాదాపు రూ.45 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది.


వరుస వర్షాలు, వరదలు

తొలి మూడు రోజులు వీకెండ్ కావడంతో దాదాపు రూ.24 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా సేఫ్ జోన్ గానే సాగాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, వరదలతో సరిపోదా శనివారం కలెక్షన్ల వరదకు గండి పడింది. అదేమిటో ఈ మూవీ విడుదలైనప్పటినుంచి వాతావరణం లో అనూహ్య మార్పులు సంభవించాయి. దీనికి తోడు వరుస తుపానుల ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. నాని, ఎస్ జె సూర్య కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని..సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని..దర్శకుడు వివేక్ ఆత్రేయ నానికి మంచి హిట్టు ఇచ్చాడని అంతా చెప్పుకున్నారు. అయితే అవేమీ సరిపోదా శనివారం మూవీకి హైప్ తేలేకపోయాయి. కేవలం ఓవర్ సీస్ కలెక్షన్లు మాత్రమే ఈ సినిమాకు కొద్దో గొప్పో లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ మూవీ నానీ గత సినిమాల కన్నా అత్యధిక ఫ్యాన్సీ రేటుకు అమ్ముకున్నారు. విడుదల కాకముందే ఈ సినిమాకు ఫ్యాన్సీ రేటు బాగానే వచ్చింది. దీనితో నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.


కలిసిరాని వీకెండ్ హాలిడేస్

దీనిని అధిక రేటుకు కొని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం సరిపోదా శనివారం కలెక్షన్లు దెబ్బ కొట్టాయి. మెల్లిగా పికప్ అవుతుందన్న ఆశలు కూడా లేవు ఈ మూవీకి. దీనికన్నా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ’35 చిన్న కథ కాదు ‘మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఇది కూడా సరిపోదా శనివారంలో పాటే రిలీజయింది. తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో పెట్టిన పెట్టుబడి తక్కువ రోజుల్లోనే రాబట్టేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి దగ్గరలోనే ఉన్నా..పికప్ అవుతుందనే ఆశ మాత్రం లేదు. మొన్నటి వీకెండ్ వినాయకచవితి, ఆదివారం కలెక్షన్లు బాగుంటే ఈ సినిమా గట్టెక్కేది. ప్రస్తుతం లాభాల మాట దేవుడెరుగు కనీసం బ్రేక్ ఈవెన్ సాధిస్తే చాలు అని పంపిణీ దారులు కోరుకుంటున్నారు .

తక్కువ శాతం నష్టాలే..

నాని సినిమా రిలీజయినప్పటినుంచి పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ మూవీకి కలిసొస్తుందని భావించారు అంతా. అయితే భారీ వర్షాలతో వచ్చే కలెక్షన్లు కూడా రావడం లేదు. వచ్చేవారం ’మత్తు వదలరా 2‘ మూవీ విడుదల కానుంది. దీనితో చాలా చోట్ల సరిపోదా శనివారం మూవీని తీసేసి ఈ మూవీని ప్రదర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ మూడు రోజుల్లో వచ్చే కలెక్షన్లే సరిపోదా శనివారం మూవీని కాపాడాలి. ఒక వేళ నష్టాలు వచ్చినా అంత భారీ స్థాయిలో ఉండవని తెలుస్తోంది. తక్కువ నష్టాలతో పంపిణీదారులు బయటపడవచ్చు అనుకుంటున్నాయి పరిశ్రమ వర్గాలు.

 

Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×