BigTV English

Dulquer Salmaan : దుల్కర్ 70 కార్లు కొని అవి ఎక్కడ దాచాడో తెలుసా.?

Dulquer Salmaan : దుల్కర్ 70 కార్లు కొని అవి ఎక్కడ దాచాడో తెలుసా.?

Dulquer Salmaan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా షోస్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఈ షో. ఇప్పటివరకు ఈ షో కి చాలామంది సెలబ్రిటీస్ గెస్ట్ లుగా వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) వంటి స్టార్ హీరోలు కూడా ఈ షో కి గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ షో మిగతా వాటికంటే చాలా ప్రత్యేకమని చెప్పాలి ఎన్నో రకమైన విషయాలు ఈ షో ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. ఈ షో తర్వాత బాలకృష్ణ రేంజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ షో తర్వాత చేసిన అఖండ, వీర సింహరెడ్డి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించాయి. ఇక రీసెంట్ గా ఈ షో కి లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ హాజరైంది.


ఈ షోలో అనేకమైన అంశాలను ప్రస్తావించారు. లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అన్ స్టాపబుల్ షో కి ఈ చిత్ర యూనిట్ హాజరైంది. నిర్మాత నాగ వంశీ కూడా ఈ షోకి హాజరయ్యాడు. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గురించి అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురం లో వంటి సినిమాల సక్సెస్ గురించి కూడా మాట్లాడారు. ఈ షోలో మిగతా సెలబ్రిటీస్ కి ఫోన్ చేసి కొన్ని సీక్రెట్ విషయాలు రాబట్టడం బాలకృష్ణ ఎప్పటినుంచో చేస్తూ వస్తున్నారు. ఇక వెంకీ అట్లూరి కూడా దుల్కర్ వి కొన్ని సీక్రెట్స్ రివీల్ చేశాడు.

Also Read : Allu Arjun – Ram Charan : ఏంటి రామ్ చరణ్.. మా అన్నను కాపీ కొట్టావా.. ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..


దుల్కర్ సల్మాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ ఆ తర్వాత సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఇక అన్ స్టాపబుల్ షోలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ కి కార్లు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు దాదాపు దుల్కర్ సల్మాన్ 70 కార్ల వరకు కొనుగోలు చేశాడంట. అయితే ఈ కార్లను అక్కడ ఉంచితే తిడతారని చెప్పి హైదరాబాద్ లో చాలామంది ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఒక్కొక్క కారును పార్క్ చేసి ఉంచాడని అసలు విషయం చెప్పేసాడు. ఈ విషయం రివీల్ చేయగానే దుల్కర్ సల్మాన్ చాలా భయపడుతూ నో సార్ నో సార్ అంటూ బాలకృష్ణకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×