BigTV English

Saripodhaa Sanivaaram: నానికి షాక్.. ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్

Saripodhaa Sanivaaram: నానికి షాక్.. ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ అత్ర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం.  ఎస్ జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాపై మొదటి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి.. అంచనాలకు తగ్గట్టే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.


క్లాస్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి మాస్ సంభవాన్ని ప్రేక్షకులు ఊహించలేదు. నాని – సూర్య నటనకు అయితే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో.. మంచి జోష్ మీద ఉన్న నానికి షాక్ తగలనుందా.. ?అంటే నిజమే అంటున్నారు. అందుకు కారణం.. ఈ సినిమా మొత్తం ఆన్ లైన్ లో ప్రత్యేక్షమయ్యింది.

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి లీక్ లు తప్పేవి కాదు. సినిమా ప్రింట్ పడగగానే.. మూవీ రూల్స్ లో కనిపించేవి. ఆ తరువాత ఫైరసీని కంట్రోల్ చేయడంతో కొంతవరకు మేకర్స్ కు భారం తగ్గింది. ఇక ఇప్పుడు మళ్లీ పైరసీ కోరలు చాస్తోంది. సోషల్ మీడియాలో సరిపోదా శనివారం డౌన్ లోడ్, మూవీ రూల్స్ అనే హ్యాష్ టాగ్స్ ట్రెండ్ గా మారాయి. తమిళరాకర్స్, మూవీరుల్జ్, 1337x మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు HD ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో చూడటానికి అందుబాటులో ఉంచారు.


ఇక ఈ లింక్ లను నెటిజన్స్ డౌన్ లోడ్ చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. చాలా కాలం తరువాత ఆన్ లైన్ లో లీక్ అయిన మొదటి తెలుగు సినిమా ఇదే. తమిళ్ లో ఇప్పటికే ఆన్‌లైన్ పైరసీ బారిన పడిన మహారాజా, రాయన్ మరియు గురువాయూరపన్ అంబలనాడై అన్నీ అక్రమ సైట్‌లో ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి.

ఇక ఈ పైరసీ లింక్ లు  ఇలాగే కొనసాగితే.. సినిమాకు గట్టి దెబ్బనే తగులుతుందని చెప్పాలి. మంచి కంటెంట్ ను ఇలా పైరసీ చేసి థియేటర్ కు ప్రేక్షకులు రానివ్వకుండా చేస్తున్నారు.  ఈ పైరసీని అరికట్టకపోతే మేకర్స్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి ఈ పైరసీ మీద మేకర్స్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×