BigTV English

Viral Video: క్రియేటివిటీ అదిరిపోయింది కదా.. పెళ్లిలో రాకెట్ బాంబుపై వధువరుల ఊరేగింపు..

Viral Video: క్రియేటివిటీ అదిరిపోయింది కదా.. పెళ్లిలో రాకెట్ బాంబుపై వధువరుల ఊరేగింపు..

Viral Video: ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ కళ. ఎంతో ఘనంగా, ఎవ్వరు కనీవిని ఎరుగని తీరులో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ఈ తరుణంలో పెళ్లి సంబంధాలు చూసే సమయం నుంచే పెళ్లి చూపుల నుంచి మొదలుకుని, పెళ్లి తంతు ముగిసే వరకు ఎలా చేయాలి, ఏంటి అని ప్లాన్లు వేస్తుంటారు. ఈ తరుణంలో ఫోటోల నుంచి మొదలుకుని, పెళ్లి మండపం, బాజా బజంత్రీలు, ఇలా అన్నింటిలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇఱుగుపొరుగు వారు అందరినీ పిలిచి ఎంతో వైభవంగా పెళ్లి వేడుకను జరుపుకుంటారు. అయితే ఇందులో ముఖ్యంగా ఫోటో షూట్స్ పై ఇటీవల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఏదో ఒక వినూత్నత ఉండాలని కోరుకుంటున్నారు.


అందరి పెళ్లిళ్ల మాదిరి కాకుండా తమ పెళ్లిళ్లో ఏదో ఒక వింత ఉండాలని ఆలోచిస్తూ వినూత్న చర్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వధువరులు చేసిన వినూత్న ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. వధువరులు ఇద్దరు కలిసి ఫోటో షూట్ చేయాలని అనుకున్నారు. ఈ తరుణంలో ఏదో ఒక వినూత్నత ఉండాలని అనుకుని దాని కోసం చాలా వింత ప్రయత్నం చేశారు.

ఇద్దరు వధువరులు కలిసి రాకెట్ పై ప్రయాణం చేసినట్లు ఉండేలా ఓ వీడియోను చిత్రీకరించారు. వీడియోలో ఓ పెద్ద రాకెట్ తీసుకుని దానిపై వధువరులు ఇద్దరు కూర్చున్నారు. వారి వెనకాల వారి స్నేహితులు అందరు కలిసి ఉన్నారు. అయితే ఒక దానితో మంట వెలిగించి దానిని రాకెట్ కు నిప్పంటించారు. దీంతో రాకెట్ అమాంతం గాల్లోకి ఎగిరినట్లు దానిపై వధువరులు ఇద్దరు కూర్చుని ఉన్నట్లు వీడియోను చిత్రీకరించారు. అయితే దీనిని చూస్తే నిజమైన రాకెట్ అనే భావన కలిగేలా చేశారు. కానీ ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది.


 

Related News

Love marriage ban: ప్రేమించారో గ్రామ బహిష్కారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పెద్దలు.. ఎక్కడంటే?

Baba Vanga Prediction: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!

Noida Man: తల్లి మరణం.. 20 ఏళ్ల యువకుడి ఖాతాలోకి రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299..

Viral Video: ఇంగ్లండ్ లోనూ ఉమ్మేస్తున్నారు.. ఈ ఖైనీ బ్యాచ్ మారరు!

Biggest Banana: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?

TCS Employee: ఐటీ ఉద్యోగి రోడ్డుపై నిద్ర.. టీసీఎస్ స్పందన ఇదే

Big Stories

×