Animal Movie Song : నాన్న నువ్వు నా ప్రాణం.. సెంటిమెంట్ సాంగ్ రిలీజ్..

Animal Movie Song : నాన్న నువ్వు నా ప్రాణం.. సెంటిమెంట్ సాంగ్ రిలీజ్..

Animal Movie
Share this post with your friends

Animal Movie

Animal Movie Song : సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రన్బీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. డిసెంబర్ 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరుని కూడా పెంచారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన పాటలను కూడా ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా మూవీ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ మూవీపై అంచనాలను భారీగా పెంచింది. మరి ఇప్పుడు వచ్చిన సెంటిమెంట్ సాంగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రమోషన్స్ విషయంలో మూవీ యూనిట్ ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నారు. మొదట పోస్టర్స్ రిలీజ్ చేసి చిత్రంపై ఒక హైప్ తీసుకొచ్చారు. స్టోరీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉన్న టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఒకరకంగా మూవీపై మొదటి నుంచి ఒక ఎగ్జిట్మెంట్ ని క్రియేట్ చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రియాల్టీ షోస్, ఇంటర్వ్యూస్ అంటూ ప్రమోషన్స్ ను మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన సాంగ్ లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ , లవ్ బాండింగ్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసాం. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ తో మరొక సాంగ్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఇది ఒక రొమాంటిక్ మూవీ మాత్రమే అనుకున్న వాళ్ళు భారీ ఫాదర్ సెంటిమెంట్ ఉన్న ఈ సాంగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ ఒక్క పాటతో చిత్రంలో ఫాదర్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు.

నాన్న నువ్వు నా ప్రాణం.. అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ అందరి హృదయాలను టచ్ చేసే విధంగా ఉంది. హీరోను అతని తండ్రి చిన్నప్పటినుంచి ఎలా పెంచాడు? ఆపద వస్తే అతని కోసం ఎలా నిలబడ్డాడు? అనే అంశాలను హైలైట్ చేస్తూ పాట ముందుకు సాగుతుంది. 

ఈ పాటకు పదాలను అనంత శ్రీరామ్ అందించగా.. సోను నిగమ్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. మొత్తానికి డైరెక్టర్ యాక్షన్స్ తోపాటు ఎమోషన్స్ ని కూడా తన స్టైల్ లో చూపిస్తున్నాడు అన్న విషయం క్లియర్ గా అర్థమైంది.

ప్రస్తుతానికి ఈ మూవీపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. కానీ విడుదలయ్యాక ఎంతవరకు అంచనాలకు తగ్గట్టు నిలబడుతుందో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

BJP: పాలమూరు నుంచి మోదీ పోటీ!.. ఏది రియల్? ఏది వైరల్?

Bigtv Digital

Kiara Sidharth: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్.. కియారా, సిధ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..?

Bigtv Digital

Dev Mohan : స్టార్ హీరోయిన్లతో ఛాన్స్ లు .. ఎవరీ హీరో..?

Bigtv Digital

TRS: తెలంగాణలో మరో TRS పార్టీ.. BRSకి బిగ్ షాక్ తప్పదా?

Bigtv Digital

IND vs NZ: ఉప్పల్ వన్డే మనదే.. కివిస్ పై గెలుపు.. లాస్ట్ వరకూ టెన్షన్.. గిల్ డబుల్ జిల్

Bigtv Digital

MODI : మోదీ హైదరాబాద్ టూర్ వాయిదా.. కారణమేంటి?

Bigtv Digital

Leave a Comment