BigTV English

Nara Rohit Marriage : రేపే ఎంగేజ్మెంట్… మరీ చిన్న పిల్లని ఎలా మాస్టారు

Nara Rohit Marriage : రేపే ఎంగేజ్మెంట్… మరీ చిన్న పిల్లని ఎలా మాస్టారు

Nara Rohit Marriage : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నారా రోహిత్ ఒకరు. బాణం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోహిత్. రీసెంట్ లో నారా రోహిత్ సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు కానీ. ఒకప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ వాళ్ళకి నారా రోహిత్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. నారా రోహిత్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు నారా రోహిత్ సినిమా వస్తుంది అని అంటేనే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒక మంచి పాయింట్ ఉంటుంది అని ఆడియన్స్ అంతా ఎదురు చూసేవాళ్ళు. నారా రోహిత్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం సోలో. దర్శకుడు పరశురాం కెరియర్ లోనే ఆ సినిమాని బెస్ట్ వర్క్ అని చెప్తారు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కరోనా టైంలో చాలా లిమిటెడ్ మెంబర్స్ మధ్య పెళ్లి చేసుకున్నారు. వరుసగా ఒకేసారి యంగ్ హీరోలు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. దగ్గుపాటి రానా, నితిన్, నిఖిల్, రీసెంట్గా శర్వానంద్ వీరందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారు అయిపోయారు. ఇక నారా రోహిత్ కూడా త్వరలో ఒక ఇంటివాడు అవ్వనున్నాడు. నారా రోహిత్ కి పెళ్లి కాలేదు అనే విషయం చాలామందికి ఇప్పటివరకు తెలియదనే చెప్పాలి. ఇక నారా రోహిత్ రేపు శ్రీ లెల్ల తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న సంగతి తెలిసింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి సినిమాలో ఈ సిరి లెల్ల హీరోయిన్ గా నటించింది.

ఈ అమ్మాయి ఒక తెలుగు హీరోయిన్. గుంటూరు ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి నారా రోహిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. అయితే అంతా ఓకే కానీ నారా రోహిత్ ఏజ్ 40 సంవత్సరాలు, ఈ అమ్మాయి ఏజ్ దాదాపు 28 సంవత్సరాలు అయితే వీరిద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఏజ్ గ్యాప్ ఉన్న జంటలు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్, నజ్రియా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్య కూడా ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది.


ఇక ప్రతినిధి 2 విషయానికి వస్తే సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఈ విషయం ప్రస్తావిస్తూ నారా రోహిత్ కూడా ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో , ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదండి చాలామందికి అంటూ చెప్పుకొచ్చారు. ఇక నారా రోహిత్ ముందు నటించిన ప్రతినిధి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ గా ఈ సినిమాను చేశారు. ఆ సినిమాకి ఉన్న పాజిటివ్ బజ్ ఈ సినిమాకి ఉపయోగపడింది. కానీ ఫలితం మాత్రం లేదని చెప్పాలి. సినిమా డిజాస్టర్ అయిన కూడా నారా రోహిత్ కి సిరి లెల్ల పరిచయం అవ్వటం, ఒక ఇంటి వాడటం అనేది సంతోషకరమైన విషయం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×