BigTV English

Nara Rohit: పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. వధువు ఎవరంటే..?

Nara Rohit: పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. వధువు ఎవరంటే..?

Nara Rohit.. ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరో లేదా హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ముందు సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఒక ఫేమ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. అయితే అందులో కొంతమంది ఇండస్ట్రీలో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకొని , ఆ తర్వాత కెరియర్ పైన ఫోకస్ చేస్తే మరికొంతమంది కెరియర్ ను సక్సెస్ అందుకున్న తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతూ ఉంటారు. ఇంకొంతమంది సక్సెస్ కోసం ఆరాటపడుతూ అదే సినిమాలలో పనిచేస్తున్న వారితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


సుందరకాండతో అలరించడానికి సిద్ధమవుతున్న నారా రోహిత్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నారా రోహిత్.. బాణం సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. ఇటీవలే ప్రతినిధి -2 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలో కూడా సక్సెస్ అందుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు సుందరకాండ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.


పెళ్లి పీటలెక్కనున్న నారా హీరో..

ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల (Siri lella) తో నారా రోహిత్ ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దసరా పండుగ అయిపోయిన మరుసటి రోజు అంటే అక్టోబర్ 13వ తేదీన హైదరాబాదులో నిశ్చితార్థం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .అయితే ఈ విషయంపై అటు నారా కుటుంబం నుంచి కానీ ఇటు హీరోయిన్ కుటుంబం నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ.. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సెలబ్రిటీలు నారా రోహిత్ కి అప్పుడే శుభాకాంక్షలు చెబుతున్నారు.

నారా రోహిత్ కెరియర్..

నారా రోహిత్ కెరియర్ విషయానికి వస్తే.. సీఎం తమ్ముడి కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన చదువు అంతా కూడా హైదరాబాదులోనే పూర్తి చేసుకున్నారు.ఆ తర్వాత ఉన్నత విద్య కోసం చెన్నై వెళ్లారు రోహిత్. అక్కడ అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసి, నటన వైపు అడుగులు వేశారు. అందులో భాగంగానే న్యూయార్క్ ఫిలిం అకాడమీ న్యూయార్క్ నుండి నటన అలాగే లాస్ ఏంజిల్స్ లో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన నారా రోహిత్ 2009లో విడుదలైన బాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన చైతన్య దంతులూరి తొలిసారి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×