BigTV English

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

Ratan Tata Land Rover| టాటా గ్రూప్ మాజీ చైర్మెన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బుధవారం కన్నుమూశారు. భారతదేశంలో వ్యాపార రంగం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆటోమొబైల్స్, సాఫ్ట్‌వేర్, ఎఫ్‌ఎంసిజి ఇలా అన్ని రంగాల్లో టాటా కంపెనీ సాధించిన విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.


టాటా కంపెనీ చైర్మెన్ రతన్ టాటా పెదనాన్న జెఆర్‌డి టాటా 50 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో ఉన్నారు. రతన్ టాటా యోగ్యతను గుర్తించి జెఆర్‌డి టాటా ఆ పదవిని రతన్ టాటాకు కట్టబెట్టారు. ఆ బాధ్యతను స్వీకరించిన రతన్ టాటా రెండు దశాబ్దాలకు శ్రమించి టాటా గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. తమ కంపెనీతో పాటు భారతదేశానికి మంచి పేరు సంపాదించారు. ఏకంగా బ్రిటీష్ దిగ్గజ కంపెనీలైన కోరస్ స్టీల్, లగ్జరీ కార్ బ్రాండ్లు జాగుఆర్ ల్యాండ్ రోవర్ ని కొనుగోలు చేశారు.

అయితే ఇంత సాధించిన రతన్ టాటాకు ఒక సమయంలో ఒక అమెరికన్ కారు కంపెనీ ఓనర్ ఘోరంగా అవమానించాడు. భారతీయులకు కారు తయారీ గురించి ఏమీ తెలియదని అపహాస్యం చేశాడు. కానీ అదే అమెరికన్ కాలక్రమంలో రతన్ టాటా వద్దకు కాళ్ల బేరానికి వచ్చాడు.


Also Read: బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

1991 టాటా గ్రూప్ చైర్మెన్ పదవి చేపట్టిన రతన్ టాటా తమ కార్ల కంపెనీ నష్టాల్లో ఉండడం చూసి దాన్ని అమెరికన్ కంపెనీ ఫార్డ్ కు విక్రయించాలని ప్రయత్రించారు. అందుకోసం 1999లో అమెరికా వెళ్లారు. అక్కడ ఫార్డ్ కంపెనీ చైర్మెన్ బిల్ ఫార్డ్ తో సమావేశమయ్యారు. అయితే ఆ మీటింగ్ లో బిల్ ఫార్డ్ ను బిల్ ఫార్డ్ ఘోరంగా అవమానించాడు. ”మీ ఇండియన్స్ కు కార్లు తయారు చేయడం గురించి ఏం తెలుసు. అసలు ప్యాసింజర్ కార్లు తయారు చేయడం ఎందుకు ప్రారంభించావు? నీ కంపెనీ నేను కొనుగోలు చేయడమంటే మీపై నేను ఉపకారం చేయడమే అవుతుంది. అంతే..” అని బిల్ ఫార్డ్.. రతన్ టాటాతో చెప్పాడు. బిల్ ఫార్డ్ అన్న మాటలు రతన్ టాటా గుండెల్లో బాణాలుగా గుచ్చుకున్నాయి.

ఇదంతా విన్న తరువాత రతన్ టాటాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. తన కార్ల కంపెనీ విక్రయించకూడదని రతన్ టాటా నిర్ణయించుకున్నారు. వెంటనే ఇండియా తిరిగి వచ్చి 9 ఏళ్లలో కార్ల బిజినెస్ విజయవంతంగా నడిపారు. అయితే కాల చక్రం తిరిగింది. ఈ సారి బిల్ ఫార్డ్ కష్టాల్లో పడ్డాడు. బ్రిటీష్ లిల్యాండ్ అనే కంపెనీని బిల్ ఫార్డ్ 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి తప్పు చేశాడు. ఆ కార్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. దీంతో బిల్ ఫార్డ్ తన కార్ల కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరమైన రతన్ టాటా.. బాల్యం ఎలా గడిచిందంటే..

అటుఇటు తిరిగి బిల్ ఫార్డ్ 2008లో రతన్ టాటా వద్దకు వచ్చాడు. జాగుఆర్, ల్యాండ్ రోవర్ లగ్జరీ కారు బ్రాండ్ లను తాను విక్రయించాలనుకుంటున్నానని రతన్ టాటాతో చెప్పాడు. నష్టాల్లో ఉన్నా రతన్ టాటా ఆ లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఈ డీల్ కు ఒప్పుకోవడంతో బిల్ ఫార్డ్ అతనికి చేతులెత్తి మొక్కాడు. ”మీరు మా కార్ బ్రాండ్ కొనుగోలు చేసి నాపై ఉపకారం చేశారు.” అని రతన్ టాటాతో చెప్పాడు.

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×