BigTV English

Prathinidhi 2: బ్రేకింగ్.. ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా

Prathinidhi 2: బ్రేకింగ్.. ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా

Prathinidhi 2: కుర్ర హీరో నారా రోహిత్ హీరోగా మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి 2. 2014 లో రిలీజ్ అయిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి2 ను తెరకెక్కించారు. ఈ సినిమాలో సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ సెటైర్ గా ఈ చిత్రాన్ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా పెద్ద చర్చనీయంశంగా మారాయి. ఏప్రిల్ 25 న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నారా రోహిత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం వాయిదా పడింది. “ప్రతినిధి 2.. కొద్దిసేపు విరామం తీసుకుంది, మీకు సమీపంలోని థియేటర్‌లలో కొత్త విడుదల తేదీతో త్వరలో రిపోర్ట్ చేయబడుతుంది” అని మేకర్స్ తెలిపారు. అయితే ఎందుకు ఈ సినిమాను వాయిదా వేశారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్నికల వేళ ఈ సినిమాను రిలీజ్ చేయకుండా చాలామంది కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 25 నే ఈ సినిమాను విడుదల చేయడానికి కారణం.. 2014 లో కూడా ఏప్రిల్ 25 నే ప్రతినిధి సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా అదే డేట్ ను అనుకున్నారు కానీ, ఇది వర్క్ అవుట్ కాలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×