Sri Sri Sri Raajavaru : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లందరూ కూడా మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నార్నె నితిన్ ఒకరు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన మ్యాడ్ స్క్వేర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి ఆ సినిమా కంటే ముందే శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే ఒక సినిమాను చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా రిలీజ్ కి నోచుకోకుండా అయిపోయింది. ఇక మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత నితిన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలానే ఎన్టీఆర్ కి బావమరిది కావడంతో కూడా కొంత ఫ్యాన్ బేస్ మొదలైంది.
ఆయ్ సినిమాతో మరో హిట్
నార్నె నితిన్ హీరోగా చేసిన మరో సినిమా ఆయ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. సినిమా బాగుంటే అది చిన్నది పెద్దది అని తేడా లేకుండా ఆడుతుంది అని మరోసారి ఈ సినిమాతో రుజువు అయింది. ఈ సినిమా తర్వాత మీ మ్యాడ్ స్క్వేర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైంది. ఇదివరకే రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వరుసగా మూడు సినిమాలు హిట్ అయిన తర్వాత నితిన్ కి ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది కాబట్టి ఎప్పుడో విడుదల కావలసిన శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమాను నేడు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది.
శతమానం భవతి హైప్
శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఇదివరకే ఈయన దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో పోటీగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అయితే మళ్లీ అదే తరహాలో ఎంతవాడుగాని అనే సినిమాను తీశాడు సతీష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే నితిన్ ను లాంచ్ చేయడానికి ఈ శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఒక రకంగా దర్శకుడు కూడా మైనస్ అయిపోయింది.
Also Read : Mallidi Vassishta : విశ్వంభరా దర్శకుడు, హీరోగా సినిమాలు చేశాడని తెలుసా.?