Mallidi Vassishta : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో విశ్వంభర సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. దాదాపు కళ్యాణ్ రామ్ పరిస్థితి అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ కు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్నాడు.
రెండో సినిమాకి మెగా ఛాన్స్
దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమా బింబిసార సోసియో ఫాంటసీ జోనర్ లో చేసాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు వశిష్ట. ఇకపోతే రెండవ సినిమాకి మెగాస్టార్ చిరంజీవితో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది కలలు కంటున్నారు. ఎంతోమంది దర్శకులకి మెగాస్టార్ తో ఆల్మోస్ట్ కథ ఓకే అయిపోయింది అనుకునే తరుణంలో కూడా ఆ సినిమా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే విశ్వంభరా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వరకు జరుగుతుంది. ఈ సినిమాని కూడా త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇకపోతే మరోవైపు మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు.
దర్శకుడు కంటే ముందు హీరోగా
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్వతహాగా వశిష్ట ఫాదర్ నిర్మాత కావడంతో తాను కూడా హీరోగా సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే ప్రముఖ సాహిత్య రచయిత కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాసా సినిమాలో హీరోగా నటించాడు వశిష్ట. ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత కంటెంట్ చూసుకున్నారు. సినిమా సరిగ్గా రాలేదు అని వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తే డబ్బులు పోతాయి అని తెలిసి. జెమినీ టీవీకి శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. ఈ సినిమా అప్పుడప్పుడు జెమినీలో వస్తుంది. ఈ విషయాన్ని వశిష్ట ఫాదర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.
Also Read: Bunny Vasu : మీ వ్యాపారం బాగానే చేసుకుని, ఉపదేశాలిస్తారేంటి?