AA22: పుష్ప 2 తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. హ్యాట్రిక్ హిట్ కాంబో కావడంతో నాలుగుసారి ఎలాంటి సినిమాతో రాబోతున్నారో అని ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసారు. పుష్ప 2 రిలీజ్ అయినా వెంటనే బన్నీ.. త్రివిక్రమ్ సినిమా సెట్ లో వాలిపోతారు అనుకున్నారు. కానీ, ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా కనీసం మనస్ఫూర్తిగా సెలబ్రేషన్స్ చేసుకోలేపోయాడు బన్నీ. సంధ్యా థియేటర్ వివాదంలో బన్నీ అరెస్ట్ అవ్వడం.. పోలీసులు, కేసు అంటూ తిరుగుతూనే వచ్చాడు.
ఇక ఈ వివాదం సద్దుమణిగాకా అయినా త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు అనుకుంటే.. అభిమానులకు బన్నీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో AA 22 ని ఫైనల్ చేసి అధికారికంగా కూడా ప్రకటించేశాడు. ఈ కాంబో అస్సలు ఎవరు ఊహించనిది. ఈ ఇద్దరూ కూడా 1000 కోట్ల క్లబ్ లో ఉన్నవారే. జవాన్ తో అట్లీ.. పుష్ప 2 తో బన్నీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అలాంటి ఆ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే.. ఏ రేంజ్ హైప్ ఉండాలి. ఈ సినిమా ప్రకటన రాగానే బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో ఈసారి మా టార్గెట్ 2500 కోట్లు అంటూ అల్లు ఫ్యాన్స్ సవాళ్లు విసురుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి.. ఆ ముగ్గురు హీరోయిన్స్ ను కూడా ఆ రేంజ్ లో ఉన్నవారినే తీసుకోనున్నారని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్.. బన్నీ పక్కన కనిపించబోతున్నారని తెలుస్తోంది, తాజాగా సన్ పిక్చర్స్.. రేపు AA22 కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ అప్డేట్ దీపికా పదుకొనే అనౌన్స్ మెంట్ అని సమాచారం.
గత కొన్ని రోజులుగా దీపికా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ లో ప్రభాస్ సరసన మొదట దీపికాను సెలెక్ట్ చేయడం.. ఆమె ఎక్కువ డిమాండ్ చేయడంతో వంగా రిజెక్ట్ చేయడం జరిగాయి. ఆ తరువాత దీపికా.. స్పిరిట్ కథను లీక్ చేయడంతో వంగా ఫైర్ అయ్యాడు. హీరోయిన్ కి సినిమా స్టోరీ నమ్మి చెప్తామని, దాన్ని ఇలా బయటపెట్టడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. వంగాకు స్ట్రాంగ్ కౌంటర్ గా దీపికా.. తాను నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తానని, జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని కౌంటర్ వేసింది. ఇక ఈ వివాదం బయటపడడంతో నెటిజన్స్ దీపికాపై విమర్శలు గుప్పించారు. వంగాను నువ్వేం చేయలేవని, ఇంకా తెలుగులో పెద్ద సినిమాలు రావు అని కామెంట్స్ చేశారు. కానీ, అల్లు అర్జున్ సినిమాలో అమ్మడు ఛాన్స్ పట్టేసి వారందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.