BigTV English

National Award Celebrations: పార్టీ లేదా పుష్ప.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా .. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ..

National Award Celebrations: పార్టీ లేదా పుష్ప.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా .. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ..

National Award Celebrations: ఈ సంవత్సరం టాలీవుడ్ వరుస విజయాలతో స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన సత్తా చాటింది. మొన్న ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాలు చేజిక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినిమాలకు ఇండియా మొత్తం క్రేజ్ పెరగడంతో పాటు టాలీవుడ్ యాక్టర్స్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా పుష్ప మూవీ కి గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకోవడం నిజంగా సినీ పరిశ్రమకు ఎంతో గర్వించదగ్గ విషయం.


టాలీవుడ్ లో ఎదుగుదల అంటే కచ్చితంగా అది మైత్రి మూవీ మేకర్స్ ఎదుగుదలా అనే కదా చెప్పాలి. అమెరికాలో డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్
న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్, సివి మోహ‌న్.. టాలీవుడ్ నిర్మాతలగా అడుగుపెట్టిన తర్వాత నుంచి ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో తిరుగులేని రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురిలో సీవీ మోహ‌న్ ఇప్పుడు కలిసి లేకపోయినప్పటికీ మిగిలిన ఇద్దరు సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.

అగ్ర హీరోలతో, బడా బడ్జెట్ తో ఆల్ టైం హిట్ చిత్రాలను తెరకెక్కించడం తో పాటు నవతరం టాలెంట్ కు బూస్ట్ ఇవ్వడం లో ముందుంటుంది మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ నుంచి వచ్చిన పుష్ప చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ద‌క్కింది. పుష్ప టైటిల్ క్యారెక్టర్ లో నటించిన అల్లు అర్జున్ నటనకు అతడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.


పుష్ప మూవీ లో సాంగ్స్ మనల్ని కాదు విదేశాల్లో సెలబ్రిటీలను సైతం స్టెప్పులు వేయించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సాంగ్స్ కి ఎందరో వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన పుష్ప మూవీ మ్యూజిక్ జాతీయ అవార్డును దక్కించుకుంది. పుష్ప చిత్రంతోపాటు మైత్రి సంస్థ నిర్మించిన మరొక చిత్రం ఉప్పెన సైతం జాతీయ అవార్డును దక్కించుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం. ఈ అరుదైన ఘనతకు తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంది మైత్రి మూవీ మేకర్ సంస్థ.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా జాతీయ అవార్డు విజేతల కోసం ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ మైత్రి మూవీ సంస్థ ప్లాన్ చేసింది. భారీ సెట్టింగ్ లు, కళ్ళు జిగేల్ మనే లైటింగ్ కాంతి తో సినీ తారలకు బ్రహ్మాండమైన వేదికను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×