natti kumar On Pravasthi: ఒకప్పుడు ‘సూపర్ సింగర్’ వంటి ప్రోగ్రాంలో విజేతగా నిలిచి, తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) సడన్గా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం పై, అలాగే ఆ ప్రోగ్రాం నిర్వహుకులపై, ఆ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సింగర్ సునీత (Singer Sunitha), మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి(MM Keeravani) పై చేసిన కామెంట్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యంగా స్టేజ్ పైకి అడుగు పెట్టినప్పుడు అటు అమ్మాయిలను అదోలాగా చూసేవారు. ఇటు సింగర్ సునీత అబ్బాయిలు వస్తే ఒకలాగా.. ప్రత్యేకించి తాను వస్తే మొహం మార్చుకునేది. నేను పాడితే ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తించేది. ఒక పెళ్లిలో పాటలు పాడితే పెళ్ళిలో పాటలు పాడేవారు సింగర్సా అంటూ అవమానించారు. ఇక బొడ్డు కిందకు చీర కట్టుకొని రమ్మని , కాస్ట్యూమ్స్ విషయంలో ఇబ్బంది పెట్టేవారు. బాడీ షేమింగ్ చేశారు. కావాలని నన్ను షో నుండి ఎలిమినేట్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రవస్తి వ్యాఖ్యలపై స్పందించిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్..
అయితే ప్రవస్తి ఆ వీడియో అలా రిలీజ్ చేసిందో లేదో వెంటనే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ కూడా స్పందించింది. ప్రవస్తి ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తోందో అర్థం కావడం లేదు. గత 25 సంవత్సరాలుగా ”పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రతి వారం కూడా ఒక్కో థీమ్ తో టీం ముందుకొస్తుంది. ఆ టీం కి తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్ వాళ్ళే ధరిస్తారు. ఎవరిని మేము ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలని ఇబ్బంది పెట్టలేదు. ఇక బాడీ షేవింగ్ చేశాము అని ప్రవస్తీ చెబుతోంది. ఎవరిని కూడా షో లో ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు అంటూ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
ప్రోగ్రాం కి – లైవ్ కి తేడా తెలియకపోతే ఎలా..?
అయితే ఇప్పుడు నట్టి కుమార్ కూడా తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో.. ప్రోగ్రాం కి లైవ్ షో కి తేడా తెలియకపోతే ఎలా అంటూ సింగర్ ప్రవస్తిపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. న్యూస్ ఛానల్స్ అనేవి లైవ్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూపిస్తారు. కానీ పాడుతా తీయగా, బిగ్ బాస్ లాంటివి ప్రోగ్రామ్స్.. లైవ్ కాదు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్లకి డైరెక్టర్ ఉంటారు. ఫలానా సందర్భంలో డైరెక్టర్ నవ్వాలి అంటే జడ్జెస్ నవ్వుతారు ఫలానా సమయంలో సీరియస్ అవ్వాలి.. ఫలానా టైమ్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి అని..ఇలా డైరెక్టర్ ఏం చెప్పినా సరే జడ్జెస్ అది చేయాల్సి ఉంటుంది. సునీత పైన కూడా ప్రవస్తి కామెంట్లు చేసింది కదా.. అక్కడ డైరెక్టర్ ఏది చెబితే అదే చేయాలి కాబట్టి ప్రత్యేకించి ఎవరిని అక్కడ టార్గెట్ చేయరు. ఇక ఇలాంటి షోలకు వాళ్లే పిలిచి నీకు అవకాశం ఇస్తే నువ్వే విన్నర్ అవుతావు.. లేదా నువ్వే అడిగి షో కి వెళ్తే బకరా అవుతావు.. ఇక బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలు కూడా అంతే. వాళ్ళు ఎవరినైతే ఒకటి, రెండు, మూడు అని విజేతలుగా నిర్ణయించుకుంటారో వారిని విజేతలుగా చేస్తారు. ఇక సెట్ లో ప్రత్యేకించి బాడీ షేమింగ్ చేశారు అని పేర్లు కూడా బయటపెట్టింది. ఇక నీకు సమస్య ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. సమస్య ఉన్నప్పుడు బహిరంగంగా కూడా చెప్పాలి తప్పులేదు అయితే అది ఎలాంటి షో.. ఏ డైరెక్షన్లో జరుగుతోంది.. ఇలా అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతనే షో కి వెళ్ళాలి.. అన్నీ తెలిసిన తర్వాత కూడా నీకు అన్యాయమే జరిగిందని అనిపిస్తేనే ఇలా బహిరంగంగా చెప్పుకోవాలి. అంటూ నట్టి కుమార్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.