BigTV English

RRR : ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ సందడి.. అట్టహాసంగా అవార్డుల వేడుక..

RRR : ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ సందడి.. అట్టహాసంగా అవార్డుల వేడుక..

RRR : ఆస్కార్ అవార్డ్స్- 2023 వేడుక అట్టహాసంగా కొనసాగుతోంది. హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, తారలతోపాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. హాలీవుడ్ స్టార్స్ అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను నెరవేర్చేందుకు అడుగు దూరంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ ప్రదర్శన ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఆస్కార్‌-2023 వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట అదరగొట్టింది. గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడారు. అదే సమయంలో వెస్ట్రన్‌ డ్యాన్సర్‌ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఇలా ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు.

ఈ వేడుకలో బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణె స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటను ఆమె ఆస్కార్‌ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని వేడుకకు హాజరైన వారికి వివరించారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×