BigTV English

Nani Movie Update: మారిన బడ్జెట్ లెక్కలు.. ఆగిన నాని సినిమా..?

Nani Movie Update: మారిన బడ్జెట్ లెక్కలు.. ఆగిన నాని సినిమా..?

Natural Star Nani – Director Sujith Movie is on Hold: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సుజిత్ ప్రస్తుతం OG సినిమాతో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కొంతవరకు షూటింగ్ ను ఫినిష్ చేసుకుంది. మధ్యలో పవన్ ఎన్నికల కారణంగా సినిమా ఆగింది.


ఇక ఈలోపు సుజిత్.. నానికి ఒక కథను సిద్ధం చేయడంతో డీవీవీ దానయ్యనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడు. అలా నాని 32 మొదలయ్యింది. ఫిబ్రవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను హోల్డ్ లో ఉంచారని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో కొన్ని విబేధాలు రావడంతో కొన్నిరోజులు ఈ సినిమాను హోల్డ్ లో ఉంచారని టాక్. మరి ఈ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Also Read: Serial Actress Sireesha: విడాకులు ప్రకటించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ హీరోయిన్..


OG సినిమాతో సుజీత్ పై పెద్ద బాధ్యత పడింది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ చూపించడంతో ఇండస్ట్రీ మొత్తం సుజిత్ పైనే కన్నేసింది. అప్పటికే నాని..సుజిత్ తో ఒక సినిమాను పట్టాలెక్కించడంతో ఈ సినిమా కూడా మంచి పాన్ ఇండియా మూవీ అవుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ, ఇది బడ్జెట్ లెక్కలు మారడంతో ఆగింది. మరి ఈలోపు సరిపోదా శనివారం సినిమాతో నాని హిట్ కొడతాడేమో చూడాలి.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×