Big Stories

Kishan Reddy on Elections: దేశంలో కమల వికాసం ఖాయం.. ఏపీలో అధికారం ఆ పార్టీదే!

Kishan Reddy on Lok Sabha Elections and AP Elections 2024: దేశంలో కమల వికాసం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లను గెల్చుకుంటుందని చెప్పారు. అందరనీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

రిజర్వేషన్లు తదితర అంశాలపై అధికార పార్టీ తప్పుడు ప్రచారాలు చేసిందని అన్నారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణలో ప్రధాని మోదీ ఛరీష్మా కనిపించదని.. తెలంగాణలో ప్రతి గ్రామం మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుందని తెలిపారు. ప్రజలందరూ కలసి కట్టుగా బీజేపీకి ఓట్లేశారని అన్నార. దీని ఫలితంగానే.. ఇవాళ గ్రామాల్లో ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయని తెలిపారు. ఇన్నాళ్లుగా బీజేపీ చొచ్చుకుపోలేని చోట కూడా మోదీ ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు కిషన్ రెడ్డి. మోదీ గురించి కమలం గుర్తు గురించి ప్రతి ఊరిలో చర్చ జరిగిందని.. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా నిలిచాయని అన్నారు.

- Advertisement -

రిజర్వేషన్లు ఎత్తేసే శక్తి ఎవరికీ లేదన్నారు కిషన్ రెడ్డి. అంబేద్కర్ అనుకున్నా ఇవాళ దేశం నుంచి రిజర్వేషన్లు తొలగించలేరని, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రధాని మోదీ తన కంఠంలో ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లను తీసేసే ప్రసక్తే లేదన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే వర్గాలన్నీ ముందుండి బీజేపీకి ఓటేశాయనేది అర్థమైందన్నారు కేంద్ర మంత్రి.

Also Read: Jagan Met I‘‘pac” : ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం షాకవ్వడం ఖాయం : సీఎం జగన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని ప్రజలు నవ్వుకున్నారన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను గురించి మాట్లాడలేదన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రైతులకు 2లక్షల రుణమాఫీ అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అసలు తెలంగాణలో ఇంత వరకు పాలన మొదలు కాలేదన్నారు కిషన్ రెడ్డి. పాలన మొదలు పెట్టకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని రేవంత్ రెడ్డి ఎలా అన్నారని ప్రశ్నించారాయన.

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు ఆయన. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్యాయంగా తెలంగాణలో బీజేపీ అవతరించబోతుందని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణలో అస్తిత్వం కోల్పోనుందన్నారు కిషన్ రెడ్డి. ప్రజలు గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేశారని ఇప్పుడు బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయని ఫైర్ అయ్యారు.

Also Read: సంజయ్ కామెంట్స్, ఫలితాల తర్వాత కేసీఆర్

ఏపీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చిన కిషన్ రెడ్డి ఎన్డీయే కూటమిదే అధికారం అని తేల్చిచెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ భాగస్వామ్య పార్టీ అని.. ప్రజలు ఏపీలో స్పష్టమైన మార్పును కోరుకున్నారన్నారాయన. ప్రజల్లో మార్పు రావడం సహించకనే అభ్యర్థులు గొడవలకు దిగుతున్నారని.. నిరాశ, నిస్పృహ వల్ల అల్లర్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News