BigTV English

Nayanthara: ముంబై ఎయిర్పోర్టులో పిల్లలతో కనిపించిన నయన్.. ఎంత స్టార్ అయినా తల్లే కదా..!

Nayanthara: ముంబై ఎయిర్పోర్టులో పిల్లలతో కనిపించిన నయన్.. ఎంత స్టార్ అయినా తల్లే కదా..!

Nayanthara:సాధారణంగా కలెక్టర్ అయినా.. ప్రధానమంత్రి అయినా.. స్టార్ సెలబ్రిటీ అయినా.. ఏ హోదాలో ఉన్నా సరే తల్లి తల్లే.. ఎంత కష్టంలో ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా.. పిల్లల్ని మాత్రం చూసుకోవాల్సిందే. సరిగ్గా ఇప్పుడు ఇలాగే చేసింది ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara). ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార.. ఇండస్ట్రీకి వచ్చి 19 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంటూ.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.
మరొకవైపు వ్యక్తిగత జీవితంలో ఇద్దరు మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన ఈమె.. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇకపోతే తాజాగా తన ఇద్దరు కొడుకులతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Pooja Hegde: శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు.. దానికోసం ఎంత ఆరాటమో..!

పిల్లలతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన నయనతార.


ప్రస్తుతం నయనతార కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటిస్తున్న ‘టాక్సిక్ ‘ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యష్ కి సోదరిగా నటిస్తోందని సమాచారం. ప్రస్తుతం టాక్సిక్ మూవీకి సంబంధించి ముంబై షెడ్యూలు ప్రారంభం అవడంతో..తన పార్ట్ కి సంబంధించిన షూటింగు ఇప్పుడు ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పిల్లల్ని చెన్నైలోనే వదిలి ముంబైకి వెళ్లి షూటింగ్లో పాల్గొనలేక.. పిల్లల చూసుకోవడానికి, పిల్లల్ని చంకన ఎత్తుకొని మరీ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించడంతో ఎంత పెద్ద స్టార్ అయినా సరే తల్లే కదా అంటూ ఆమె మాతృత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే పిల్లల సంరక్షణ కోసం తన వెంట తీసుకెళ్లడంతో నయనతారను అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటున్నారు. నయనతార ఇలా ఒక సామాన్య మహిళలాగా తన కొడుకును చంక నెత్తుకుని ఎయిర్పోర్ట్లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

యష్ మూవీ కోసమే ఇదంతా..

ఇకపోతే ముంబై ఎయిర్పోర్టులో నయనతార తన పిల్లలతో కలిసి తళుక్కుమని మెరిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ఈ సినిమాలో నయనతార తో పాటు హూమా ఖురేషి, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా ఎన్నికయింది. ఒక కేజీఎఫ్ సీరీస్ తర్వాత నటిస్తున్న పవర్ఫుల్ చిత్రం టాక్సిక్. ఇందులో చాలా భిన్నంగా కనిపించబోతున్నారు.ఈ నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ కథ ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రదేశాలలో షూటింగ్ జరుగుతోంది. యష్ తన విలక్షణమైన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కన్నడ , తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలో విడుదల కాబోతోంది. మొదట ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం యష్ అభిమానులే కాదు పాన్ ఇండియా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా యష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×